
ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఫోటోనే ఒకటి వైరల్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు వైరల్ గా మారిపోయిన ఫోటోలో చూసుకుంటే అక్కడ ప్రస్తుతం తమిళ స్టార్ హీరో అజిత్ కనిపిస్తున్నాడు. అయితే అజిత్ పక్కన బక్క పలుచగా ఉన్న ఆ కుర్రాడు ఎవరు అన్నది మాత్రం గుర్తుపట్టలేకపోతున్నారు నేటిజన్స్. ఇలా అజిత్ పక్కన నిలబడి ఎంతో అమాయకంగా కనిపిస్తున్న కుర్రాడు ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్నాడు. లవ్ కామెడీ యాక్షన్ ఇలా ఏ జోనర్ లోనైనా ఆయన ఇట్టే సరిపోతాడు అని చెప్పాలి. చిన్నచిన్న రోల్స్ చేసి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన ఇక ఇప్పుడు స్టార్ హీరోగా నటనకు ప్రతిరూపంగా కొనసాగుతున్నాడు.
కేవలం హీరోగా మాత్రమే కాదు స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గాను ఇక ప్రత్యేకమైన పాత్రల్లోను కనిపిస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా కూడా కొనసాగుతున్నాడు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా తమిళ ప్రేక్షకుల మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోతున్నారు కదా. నిజమే అజిత్ పక్కన ఎంతో మైకంగా కనిపిస్తున్న కుర్రాడు విజయ్ సేతుపతి. ఇక ఇప్పుడు విజయ్ సేతుపతి పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు.
