కేజీఎఫ్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కన్నడ స్టార్ హీరో యశ్ ప్రధాన పాత్రలో ఆయన నీల్ తెరకెక్కించిన ఈ రికార్డ్స్ స్థాయి లో వసూళ్లు ను రాబట్టింది.

అంతే కాకుండా.. ఈ మూవీ తో యష్ మరియు నీల్ ఇద్దరికీ పాన్ ఇండియా క్రేజ్ కూడా వచ్చేసింది. ఇక ఇటీవల కేజీఎఫ్ 2 చిత్రంతో మరోసారి సెన్సెషన్ క్రియేట్ చేయడంతో.. ప్రశాంత్ నీల్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఆయన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ చేస్తున్నారని సమాచారం. ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ షూటింగ్ చివరిదశకు చేరుకుంటున్నట్లుగా సమాచారం.. ఇక జూన్ 4న నీల్ పుట్టిన రోజు కావడంతో సలార్ సెట్ లో బర్త్ డే సెలబ్రెషన్స్ గ్రాండ్ గా చేశారటా ప్రభాస్. ఇందుకు సంబంధించిన ఫోటోస్ కూడా నెట్టింట వైరలయ్యాయి.

మరోవైపు సోషల్ మీడియా వేదికగా ప్రశాంత్ నీల్ కు సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ ను తెలియజేస్తున్నారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. నీల్ కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ కామెంట్ చేశారు. హ్యాపీ బర్త్ డే బ్రదర్ ప్రశాంత్ నీల్..ఈ పుట్టినరోజు నీకు చాలా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ కామెంట్ చేశారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం నీల్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ను పంపించారు.

ప్రశాంత్ నీల్ కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ  నాటు కోడి పులుసు ను పంపించారు ఎన్టీఆర్.ఈ విషయాన్ని ప్రశాంత్ నీల్ వైఫ్ లిఖిత రెడ్డి తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేస్తూ.. థాంక్యూ అన్నయ్య అంటూ కూడా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట బాగా వైరలవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: