టాలీవుడ్ ప్రముఖ నటుడు, రాజకీయ నేత అయిన మురళీ మోహన్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మురళీ మోహన్ నిర్మాతగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక సందర్భంలో తనను అవమానించారని ఆయన కామెంట్లు చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం బిల్డింగ్ కావాలని చాలామందిని అడిగామని ఆయన తెలిపారు.

చాలామంది చూద్దాం చేద్దాం అని చెప్పారే తప్ప చేయలేదని మురళీ మోహన్ కామెంట్లు చేశారు. పద్మాలయ, రామానాయుడు స్టూడియోస్ మధ్య లో ఉన్న 14 ఎకరాలలో ఒక ఎకరం కావాలని మేము కోరామని వైఎస్సార్ సీఎం గా ఉన్న సమయం లో ఒకరోజు అందరం కలిసి ఆయన ను కలవడాని కి వెళ్లామని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. మేము వైఎస్సార్ ను కలవగా ఆయన ఎగతాళిగా మాట్లాడారని ఆయన తెలిపారు. ఏమయ్యా.. మీరంతా సినిమా వాళ్లు ఎకరం స్థలం కావాలని వచ్చారని మీ అందరికీ కావాల్సిన స్థలం ఇచ్చే కెపాసిటీ మురళీ మోహన్ కు ఉందని వైఎస్సార్ అన్నారని మురళీ మోహన్ పేర్కొన్నారు. జోక్ లాగా అందరూ నవ్వారని నెక్స్ట్ డే పేపర్ లో కూడా అదే వచ్చిందని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో మూడు కోట్ల రూపాయలు ఉండేవని ఆ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వడ్డీతో ఆ సమయంలో ఆఫీస్ ను నిర్వహించామని మురళీ మోహన్ అన్నారు.

మురళీ మోహన్ టీడీపీకి చెందిన నేత కావడంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో ఆ విధంగా మాట్లాడటం జరిగిందని తెలుస్తోంది. మురళీ మోహన్ ప్రస్తుతం సినిమాల కు, రాజకీయాల కు దూరంగా ఉంటూ వ్యాపారవేత్త గా బిజీగా ఉన్నారు. మురళీ మోహన్ రాబోయే రోజుల్లో రాజకీయాల్లో మళ్లీ బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: