టాలీవుడ్లో రౌడీ హీరోగా పేరుపొందిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం సమంతతో కలిసి ఖుషి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తరువాత వరుసగా విజయ్ దేవరకొండ పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నారు. ఖుషి సినిమా అయిపోయిన వెంటనే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా గీతగోవిందం-2 ఒకటి లైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ పరుశురాం దర్శకత్వం వహించిన గీత గోవిందం సినిమా విజయ్ కెరీర్లు గుర్తుండిపోయే చిత్రమని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ బ్యానర్ పైన అల్లు అరవింద్ నిర్మించడం జరిగింది. విజయ్ దేవరకొండ సరసన రష్మిక నటించింది.

ఈ మధ్యనే పరశురామ్ తో తన సినిమా ఉంటుందని విజయ్ దేవరకొండ అధికారికంగా ప్రకటించారు. కానీ గీత ఆర్ట్స్ బ్యానర్ బదులుగా దిల్ రాజుతో ఈ సినిమా నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా పూజ కార్యక్రమాలను కూడా త్వరలోనే మొదలు పెట్టబోతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ సరసన పూజా హెగ్డేను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు చిత్ర బృందం తెలుస్తోంది. విజయ రష్మికకు మధ్య ఎన్నో ముద్దు సన్నివేశాలు గట్టిగానే ప్లాన్ చేసిన పరుశురామ్ ఈ చిత్రంలో కూడా అలాంటి సీన్స్ ఉంటాయని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.


ఈ చిత్రంతో పూజా హెగ్డే జాబితాలో స్టార్ హీరోల సినిమాలు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం మహేష్ తో కలసి గుంటూరు కారం సినిమాలో నటిస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్  సినిమాలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు సినిమాలే కాకుండా ఇప్పుడు విజయ్ దేవరకొండ తో నటించే అవకాశం రావడంతో లక్కీ హీరోయిన్గా పేరు సంపాదించింది. వాస్తవానికి గత ఏడాది నుంచి వరుస ప్లాపులతో సతమతమవుతున్న పూజా హెగ్డే ఇలా అవకాశాలు అందుకోవడం అంటే అది చాలా విడ్డూరంగా ఉందంటూ అభిమానులు తెలియజేస్తున్నారు. మరి ఈ విషయం పైన చిత్ర బృందం ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: