
ఇకపోతే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య ఒక ప్రాజెక్టు ఆగిపోయిన సమయంలో తాను గుక్కపెట్టి ఏడ్చాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తన కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నాడు. ఒక నటుడుగా వివిధ భాషలకు చెందిన సినీ పరిశ్రమల్లో పని చేయాలని.. నన్ను నేను నిరూపించుకోవాలని ఎన్నో కలలు కన్నాను. అందుకు అనుగుణంగానే అమితాబచ్చన్ తో నటించే అవకాశం నాకు దక్కింది. అమితాబచ్చన్ తో పాటు తాను కూడా ఆ సినిమాలో ప్రధాన పాత్రధారుడిగా ఉన్నాను. ఇక ఈ సినిమా కోలీవుడ్లో తెరకెక్కింది. సుమారు పది రోజులపాటు షూటింగ్ కూడా జరిగింది. తీరా చూస్తే సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
అమితాబచ్చన్ తో సినిమా అనగానే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ తీరా ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయేసరికి జీర్ణించుకోలేకపోయాను. ఏకంగా చిన్న పిల్లాడిలాగా కిందపడి మరి గుక్క పెట్టి ఏడ్చాను. ఇప్పటికీ ఆ రోజులను అస్సలు మర్చిపోలేను అంటూ ఎస్ జె సూర్య చెప్పుకొచ్చాడు. భగవంతుడు నాకు ఎందుకు ఇలాంటి బాధను ఇచ్చాడు అని అనుకున్న. అయితే ఇప్పుడు ఆ దేవుడే నాకు వరుస సినిమాల్లో అవకాశాన్ని కల్పించాడు. సుమారు 5 ఏళ్ల నుంచి అమితాబ్ ప్రాజెక్టు తిరిగి ఎప్పుడు మొదలవుతుందో అని ఎదురుచూస్తున్న అంటూ చెప్పుకొచ్చాడు సూర్య.