మంచు లక్ష్మి సన్నీ లియోన్ సీక్రెట్ ను లీక్ చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తున్న సన్నీ నటిస్తున్న ‘కరెంట్ తీగ’ సినిమాలో మంచు మనోజ్ తో సన్నీ లుంగీ డాన్స్ చేసింది అనే విషయాన్ని ఈ సినిమా యూనిట్ సబ్యులకన్నా ముందుగా లీక్ చేసి తన తమ్ముడు మనోజ్ సన్నీతో లుంగీ డాన్స్ చేస్తున్న సెల్ఫీ ఫోటోను తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి నైస్ డాల్ అంటూ కామెంట్ ఇచ్చింది మంచు లక్ష్మి. సన్నీ ‘కరెంట్ తీగ’ లో టీచర్ పాత్రతో పాటు ఓ స్పెషల్ సాంగులో కనిపిస్తుందని ఇప్పటికే ఈ సినిమా యూనిట్ అధికారకంగా ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్ కూడ చాల వేగంగా జరిగిపోతోంది. అయితే ఈ సినిమాలో సన్నీకి సంబంధించిన ఒక్కఫోటో కూడా రిలీజ్ చేయలేదు.  సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను మాత్రమే రిలీజ్ చేశారు. ఈ నేపధ్యంలో సన్నీ స్పెషల్ సాంగ్ లో మనోజ్ తో లుంగీకట్టి రఫ్ ఆడించేసింది అని యూనిట్ టాక్. ఈ షూటింగ్ చూసిన లక్ష్మి ఆత్రం పట్టలేక ఓ ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టేసింది. డాన్స్ మాస్టర్ బృందా విరగదీస్తోంది అంటూ కామెంట్ కూడ చేసింది మంచు వారి అమ్మాయి.  అయితే ఈ సీక్రెట్ ను ఎవరికీ చెప్పద్దు అంటూ వెబ్ మీడియాలో ఓపెన్ సీక్రెట్ గా మార్చేసింది. లుంగీ డాన్స్ తో షారూఖ్, పవన్ లాంటి సూపర్ స్టార్లు ఆదరగోడితే ఇప్పుడు అదే బాటను ఎంచుకుంది ఒకనాటి పోర్న్ స్టార్ సన్నీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: