ప్రస్థుత పరిస్థితులలో భారతదేశ జిడిపి వృద్ధిరేటు -9.5 శాతానికి క్షీణిస్తుంది అన్న అంచనాలు ఇప్పటికే వచ్చాయి. దేశంలో అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కొన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ కొనసాగుతోంది. దీనితో ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోయింది. దీనికితోడు గ్రామీణ మార్కెట్ లో కూడ ప్రజల వినిమయం పూర్తిగా తగ్గిపోవడం మరింత కలవర పాటుకు గురి చేస్తోంది.
అయితే ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయినప్పటికీ రిటైల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతు ఉండటంతో పాటు రానున్న మూడు నెలలలో ఈ రిటైల్ ధరలు గత 10 సంవత్సరాలలో ఎప్పుడు లేనివిధంగా గరిష్ట స్థాయికి చేరుకోబోతున్నాయి అన్న హెచ్చరికలు వస్తున్నాయి. కూలీల కొరత కారణంగా వస్తువుల సరఫరాకు ఏర్పడుతున్న అవాంతరాలతో ప్రస్తుత రిటైల్ మార్కెట్ ధరల ద్రవ్యోల్బణం 6.98 శాతానికి నమోదు చేసుకోవడమే కాకుండా ఈ రిటైల్ ద్రవ్యోల్బణం మరింత పెరిగే ఆస్కారం ఉంది అన్న సూచనలను జాతీయ గణాంకాల కార్యాలయం తన లేటెస్ట్ రిపోర్ట్ లో పేర్కొంది.
దీనికితోడు రానున్నరోజులలో మార్కెట్ లో నగదు లభ్యత బాగా తగ్గిపోతుందని ఇలాంటి పరిస్థితులలో సామాన్యుడు పై ధరల భారం మరింత పెరుగుతుందని అంటున్నారు. దీనికితోడు ప్రస్తుత పరిస్థితులలో తమ సొంత ఊళ్ళకు వెళ్ళిపోయిన వలస కూలీలు ఎవరు ఇప్పట్లో నగరాలకు తిరిగి రావడానికి ఆసక్తికనపరచక పోవడంతో వస్తు సరఫరా మరింత సమస్యగా మారడంతో పాటు పెట్రోల్ డీసిల్ ధరలు రానురాను మరింత పెరిగే పరిస్థితులలో వృద్ధి పాతాళానికి దహరాలు ఆకాశానికి అన్న అంచనాలు వస్తున్నాయి.
ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగా భాగ్యనగరంతో పాటు అనేక నగరాలలో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఘోరంగా పడిపోవడంతో భూములు స్థలాల రేట్లు సగానికి సగం పడిపోయాయి. దీనితో ఈపరిస్థితులకుతోడు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పూర్తిగా పెరిగిపోవడంతో ప్రస్తుతం ఎక్కడా ఆఫీస్ స్పేస్ లకు కూడ డిమాండ్ తగ్గిపోవడం ఇలా ఏ రంగంలో చూసినా తిరోగమనంతో పరిస్థితులు కొనసాగుతున్నా రిటైల్ ధరల సూచీలు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోవడం షాకింగ్ ఇచ్చే విషయం అనుకోవాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి