ప్రస్తుత ఆర్ధిక సంవత్సర ఫలితాలు కరోనా పరిస్థితుల నేపధ్యంలో చాల నిరాశాజనకంగా ఉంటాయి అన్నఅంచనాలు గత కొద్దిరోజులుగా వస్తున్నా మన భారత జీడీపీ వృద్ధిరేటు ఏకంగా మైనస్ 11.5 శాతానికి క్షీణిస్తుందని ప్రముఖ ఫైనాన్షియల్ రేటింగ్ సంస్థ మూడీస్ చెపుతున్న అంచనాలు ఫైనాన్షియల్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
భారత్ లో కరోనా పరిస్థితులు మొదలైనప్పుడు ఇదేసంస్థ మైనస్ 4శాతం పతనం జీడిపీలో ఉంటుందని మొదట్లో అంచనాలు వేసింది. ఈసంస్థ అంచనాలకు మించి ఇప్పుడు మన జీడీపీ వృద్ధిరేటు మైనస్ 11.5 శాతం ఉంటుంది అని వస్తున్న అంచనాలు దేశీయ మార్కెట్ స్టాక్ మార్కెట్ పై అదేవిధంగా బంగారం మార్కెట్ పై ఉండవచ్చని అంచనాలు వస్తున్నాయి. అంతేకాదు భారత్ లో రోజురోజుకి అప్పుల భారం పెరిగిపోతోందని దీనితో ప్రతి భారతీయుడు పై సగటు అప్పుల భారం మరింత పెరిగిపోయే ఆస్కారం ఉందని ఈనివేదిక హెచ్చరికలు ఇస్తోంది.
ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో వస్తు వినియోగంతో పాటు వ్యాపార కార్యకలాపాలు అన్ని రంగాలలోను పూర్తిగా తగ్గిపోయాయని దీనికితోడు అన్ని రంగాల పరపతి సామరధ్యం పూర్తిగా తగ్గిపోవడంతో రానున్నరోజులలో భారత్ మరిన్ని గడ్డు సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంది అంటూ మూడీస్ నివేదిక తెలియచేస్తోంది. ప్రస్తుతం దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి క్షీణించడంతో పాటు కరోనా వ్యాప్తిని అరికట్టద్మ్లో ప్రభుత్వాలు విఫలం అవుతున్న పరిస్థితులలో అన్ని రంగాలలోను రానున్నది గడ్డుకాలమే అంటూ ఈనివేదిక అభిప్రాయం.
ఇలాంటి పరిస్థితులలో దేశంలోని సామాన్యుల వద్ద నగదు లభ్యతను పెంచడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఈ నివేదిక అభిప్రాయపడుతోంది. అన్ని రంగాలలోను కొనసాగుతున్న ఈ క్షీణత ఇలాగే కొనసాగితే భారత్ ఆర్ధిక వ్యవస్థ మహాపతనం అడుగులు వేయవచ్చని అంతర్జాతీయ ఆర్ధిక సేవల దిగ్గజం గోల్డ్ మన్ సాక్స్ హెచ్చరికలు ఇస్తోంది. ప్రస్తుత పరిస్థితులలో భారత పరపతి సామర్థ్యానికి గండి పడితే ఆ ప్రభావం దేశ ప్రజల పై చాల తీవ్రంగా ఉంటుందని ఈ నివేదిక తన అధ్యయనంలో పేర్కొంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి