అప్పుల కుంపటిగా భారత్ మారిపోతోందని కరోనా కారణంగా ఈ ఏడాది భారత ప్రభుత్వ ఋణ భారం 17 శాతం పెరిగి జీడీపీ లో 90 శాతానికి 90 శాతానికి చేరవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి వేసిన అంచనా చాలామందిని ఆశ్చర్య పరిచింది. 1991 నుండి ఇప్పటివరకు భారత్ ఋణ భారత్ ఋణ భారం జీడీపిలో 70 శాతం వద్ద స్థిరంగా కొనసాగుతోంది.


అయితే కోవిడ్-19 కారణంగా క్షీణించిన ఆర్ధిక వ్యవస్థను నిలబెట్టేందుకు ప్రభుత్వ వ్యయాలు పెంచడం పన్ను ఆదాయ క్షీణత కారణంగా ఈ ఏడాది 17 శాతం పెరిగి జీడిపిలో 90 శాతానికి చేరవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి తన అధ్యయనంలో తెలిపిందని ఒక ప్రముఖ దినపత్రిక ప్రచురించిన ఆసక్తికర కథనం చాల షాక్ ఇస్తోంది. అయితే 2025 నుండి భారత్ కు ఏర్పడిన ఈ ఋణ భారం క్రమంగా తగ్గుతుందని ప్రపంచ వృద్ధిలో భారత్ కీలక భాగస్వామిగా అవుతుందని ఆ నివేదిక అభిప్రాయ పడుతోంది.




అయితే భారత్ లో ఇప్పటికీ కటిక పేదరికం అనుభవిస్తున్నవారు చాలామంది ఉండటంతో వారికోసం మరిన్ని మద్దతు చర్యలు తప్పవని దీనికోసం ప్రభుత్వాలు ఋణాలు చేయవలసిన ఆవశ్యకత బాగా ఏర్పడుతోందని ఆ నివేదిక వెల్లడిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా పరిస్థితులు వల్ల దేశంలో 15 శాతం స్టార్టప్ లు మూత పడ్డాయని మూలధన సమస్యతో అనేక స్టార్టప్ లు సమస్యలలోకి వెళ్లిపోవడంతో అనేక లక్షల మందికి దేశవ్యాప్తంగా ఉద్యోగాలు కోల్పోతున్నారు.


ఇది ఇలా ఉండగా కరోనా పరిస్థితుల నేపధ్యంలో ఎవరు ఊహించని విధంగా సైకిళ్ళ పరిశ్రమకు భారీ డిమాండ్ ఏర్పడటమే కాకుండా సైకిళ్ళ అమ్మకాలు రెండింతలు పెరగడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. ప్రస్తుతం ప్రజలకు వ్యాధి నిరోధిక శక్తి పై అవగాహన బాగా పెరగడంతో కొద్ది పాటి దూరానికి ఇదివరకు లా కార్లు బైక్ లు వాడకుండా శారీరక శ్రమ కోసం ఫ్యాన్సీ సైకిళ్ళను చాలామంది వాడుతున్న పరిస్థితులలో ముందుగా బుక్ చేసుకుంటేకానీ ప్రస్తుతం సైకిళ్ళు దొరకని పరిస్థితి ఏర్పడటమే కాకుండా ఈ కరోనా సమయంలో సుమారు 42 లక్షల సైకిళ్ళు అమ్మకాలు జరగడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: