40 సంవత్సరాలు వయసు రాకుండానే ఒక వ్యక్తి తన జీవితంలో ఎదురైన ఎత్తుపల్లాలు తట్టుకుని కేవలం 18 నెలలలో 1000 కోట్లు సంపాదించిన ఇండియన్ బార్న్ అమెరికన్ కరణ్ బజాజ్ జీవితం చూస్తే సినిమా కథకు మించిన ట్విస్ట్ లు అనేకం ఉన్నాయి. తన తల్లి చనిపోయిన బాధలో అమెరికాలోని ‘క్రాఫ్ట్ ఫుడ్స్’ అనే కార్పోరేట్ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాన్ని వదిలివేసి అన్నీ వదులుకుని ఒక జత బట్టలు తీసుకుని స్కాట్లాండ్ లోని భౌద్ధ కేంద్రానికి వెళ్ళి అక్కడ ‘యోగి’ గా మారి కొంతకాలం కాలినడకన ప్రపంచం అంతా తిరుగుతూ మధ్యలో హిమాలయాలకు వచ్చి అక్కడ కనువిప్పు కలిగి పారిశ్రామిక వేత్తగా మారిపోయిన కరణ్ బజాజ్ జీవితంలో అనేక మలుపులు ఉన్నాయి.


కరణ్ బజాజ్ యోగి అవ్వక ముందే కార్పోరేట్ కంపెనీలో సిఈఓ గా పనిచేస్తూ తన తల్లి చనిపోయిన బాధను మరిచిపోవడానికి నవలా రచన పట్ల తనకు ఉన్న మక్కువతో 2010 లో తన మొదటి ఇంగ్లీష్ నవల ‘కీప్ ఆఫ్ ది గ్రాస్’ వ్రాశాడు. ఈ నవల మొదటి ముద్రణలోనే 70 వేల కాపీలు అమ్ముడు పోవడంతో ఆ నవలను ముద్రించిన సంస్థ వాళ్ళు కరణ్ బజాజ్ ను మరొక నవల వ్రాయమని ప్రోత్సహించి భారీ పారితోషికం ఆఫర్ చేసినా తిరస్కరించి తన తల్లి మరణం షాక్ నుండి తెరుకోలేకపోతున్నాను అని చెప్పి యోగిగా మారి రుషీకేష్ లోని శివానంద ఆశ్రమానికి వెళ్ళి అక్కడ సన్యాసిగా ఉంటున్నప్పుడు ‘ప్రతి జీవికి తాను మాత్రమే నెరవేర్చగల కర్తవ్యం ఒకటి ఉంటుంది’ అన్న ఆలోచన వచ్చి హిమాలయాల నుండి తిరిగి అమెరికా వచ్చి తన భార్య కెరీ సలహాతో ఒక ‘స్టార్టప్ కంపెనీని’ స్థాపించి పిల్లలకు ‘కంప్యూటర్ కోడింగ్’ ను ఒక గేమ్ లా నేర్పించే సంస్థను నెలకొల్పి అందరూ మహిళలే శిక్షకులుగా ఉండే ఆన్ లైన్ పోర్టల్ ప్రారంభించి తన బాధను మరిచిపోయి విజయాన్ని పొందాడు.


2018 సంవత్సరంలో కేవలం 10 మంది ఉద్యోగులతో ప్రారంభం అయిన ఈ కంపెనీ అతితక్కువ కాలంలో 4 వేల ఉద్యోగులు ఉండే కంపెనీగా మారి 100 కోట్ల ఆదాయానికి చేరుకొని ఈ సంస్థ ద్వారా రోజు వారి శిక్షణ తీసుకునే వారి సంఖ్య 25 వేల మందికి చేరుకోవడంతో కరణ్ బజాజ్ నెలకొల్పిన స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చూసి బైజూస్ కంపెనీ 2,200 కోట్లు ప్రతిఫలం ఇచ్చి కరణ్ బజాజ్ స్థాపించిన స్టార్టప్ కంపెనీని కొనడంతో ఇప్పుడు కరణ్ బజాజ్ తన భార్య పిల్లలతో ఇండియా తిరిగి వచ్చి బొంబాయిలో ఉంటూ తనకు ప్రతిఫలంగా 1000 కోట్లు బైజూస్ డీల్ లో వచ్చినా ఇప్పటికీ తనకు సన్యాసి జీవితం పై ఉన్న మక్కువతో ముంబాయిలోని ‘స్ట్రీట్ చిల్డ్రన్’ కోసం ఒక స్వచ్చంద సంస్థను నెలకొల్పి పేదరికాన్ని తొలిగించి వీలైనంత సహాయపడటంలోనే నిజమైన ఆనందం ఉంది అన్న సత్యాన్ని గ్రహించి ప్రస్తుతం సమాజ సేవ చేస్తూ తన అనుభవాలను ప్రధానంగా తీసుకుని ‘ది సీకర్’ అనే నవల వ్రాశాడు. రచయితగా కొనసాగుతూనే మరో సరికొత్త రంగం వైపు ఆలోచిస్తూ అడుగులు వేస్తు జీవితంలో ఇంకా ఎదో సాధించాలని కొత్త ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: