స్టాక్ మార్కెట్ మునుపు ఎన్నడూ చూడని గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి షేర్లలో పెట్టుబడి వైపు మళ్ళింది. తొందరగా అధిక లాభాలు ఆర్జించవచ్చు అనే ఆలోచనతో చాలామంది అప్పులు చేసి ఆస్థులను తాకట్టు పెట్టి షేర్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నారు. అయితే ఈ ట్రెండ్ ఏమాత్రం మంచిది కాదు అన్న హెచ్చరికలు వస్తున్నాయి.


దీనికితోడు చాలామంది తమకు తెలిసిన స్నేహితులు బంధువుల సలహాలతో చాలమంది షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్న పరిస్థితులలో ఇంచుమించు ఏ గ్రేడ్ షేర్లన్నీ పరుగులు తీస్తున్నాయి. మంచి ఏ గ్రేడ్ షేర్లను కొని దీర్ఘకాలం మార్కెట్ లో కొనసాగాలి అన్న ఆలోచనలతో ఇన్ వెస్ట్ చేయడం షార్ట్ టర్మ్ ట్రేడర్ గా మారాలని అవగాహన లేకుండా కొంతమంది కొత్త ఇన్ వెస్టర్లు చూస్తున్న పరుగులు వల్ల మార్కెట్ జోరు చాల బాగున్నప్పటికీ ఇది చాల అప్రమత్తంగా ఉండవలసిన సమయం అంటూ షేర్ మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.


అంతేకాదు షేర్ మార్కెట్ లో పెట్టుబడులు ఎప్పుడూ వైవిధ్యంగా ఉండాలని అలా కాకుండా ఒకే రంగానికి చెందిన షేర్ల పై అనాలోచితంగా పెట్టుబడులు పెట్టవద్దని విశ్లేషకులు సలహాలు ఇస్తున్నారు. అదేవిధంగా ఒక షేర్ తగ్గుతున్నప్పుడు ఆ షేర్ గత మూడు నెలలుగా సగటున ఎంత పెరిగింది ఎంత తగ్గింది అన్న రీసర్చ్ చేయకుండా అంచనాలను ఆధారంగా చేసుకుని షేర్లను ప్రస్తుత పరిస్థితులలో వేలంవెర్రిగా కొనవద్దని విశ్లేషకుల సలహా.


షేర్ మార్కెట్ లో రాణించాలి అని అనుకునే ఏవ్యక్తికి అయినా అత్యాస భయం అనే రెండు లక్షణాలు ఉండకూడదని మనం పెట్టుబడి పెట్టే ప్రతి షేర్ విషయంలో ఒక నిర్దిష్ట లక్ష్యం ఉండాలని నష్టం వస్తున్నప్పుడు ఎక్కువ కాలం వేచిచూడకుండా సాఫ్ట్ లాస్ తో బయటకు రావాలని షేర్ రంగంలోని విశ్లేషకుల అభిప్రాయం. మార్కెట్ ఏ దశలో ఉన్నా మనం ఎంపిక చేసుకునే షేర్లు మంచి షేర్లు అయితే ఎంతోకొంత లాభం ఉంటుందని షేర్ ఎక్స్ పర్ట్ ల అభిప్రాయం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: