జగన్ ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల నుంచి జీతాల పెంపుకు నోచుకోని వంశపారంపర్య అర్చకులుకు అతిపెద్ద శుభవార్త తెలిపారు. వారు అందుకుంటున్న జీతాల లో 20 శాతం జీతాలను అధికంగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు.. అంతే కాదు అందరి ప్రభుత్వ ఉద్యోగస్తులు అలాగే దేవాలయాల్లో పనిచేసే వంశపారంపర్య అర్చకులకు కూడా రిటైర్మెంట్ ఇవ్వాలని సూచించినప్పటికీ జగన్ ప్రభుత్వం వారిని రిటైర్మెంట్ లేకుండా ఉండేందుకు అమలు చేయడానికి కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు.


ఇక ఇటీవల దేవాదాయ శాఖ పై సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి.. అధికారులకు కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.. అంతేకాదు అర్చకులకు ఇళ్ల స్థలాల కేటాయింపు పై కూడా దృష్టి సారించాలని ఆయన తెలిపారు.. ముఖ్యంగా ఆలయాలలో టికెట్ల జారీకి ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ విధానాన్ని అమలు చేయడం వల్ల ఎక్కడా కూడా అవినీతి చోటు చేసుకోదని సీఎం జగన్ తెలిపారు.. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ చేస్తున్న మంచి మంచి విధానాలను,  మిగతా దేవాలయాల్లో కూడా ప్రవేశ పెట్టాలని ఆయన తెలిపారు..

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లో కూడా ఉత్తమ నిర్వహణ పద్ధతులను అమలు లోకి తీసుకు వస్తారట..  ఇకపై ప్రసాదాల కూడా ఆన్లైన్లో విక్రయించే అమలు తీసుకొస్తున్నట్లు సమాచారం. ఎవరైనా దేవాదాయశాఖ కమిటీకి విరాళాలు ఇవ్వాలనుకునే దాతలు, ఇకపై ఆన్లైన్ ద్వారా డబ్బులను ఇవ్వవచ్చు.. ఇలా వచ్చిన డబ్బులను ఆలయాల అభివృద్ధికి మాత్రమే వాడుకోవాలని ఆ డబ్బులు పక్కదోవ పట్టకుండా ఉండాలి అని, నేరుగా దేవాలయాలకు ఉపయోగపడాలని ఆయన అధికారులను కోరారు.


రాష్ట్రంలో సుమారుగా 18 వేల ఆలయాలు.. ఇప్పటికే భద్రత కోసం 47 వేలకుపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపిన అధికారులు, ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లగా ఎక్కడ ఆలయాలు ఉన్నా సరే, వాటి భద్రత కోసం తప్పకుండా సీసీ కెమెరాలు పెట్టేలా చూడమని అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు.. అంతేకాదు దేవాలయ భద్రతకు సంబంధించి మరికొన్ని విషయాలను చాలా పకడ్బందీగా ఉండేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: