సాధారణంగా ప్రతి ఒక్కరూ.. ప్రతిరోజు డబ్బును ఖర్చు పెడుతూ ఉండడం లేదా అవసరమైనప్పుడు అప్పు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.. కానీ ఈ వారంలో కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే మీరు ఆ డబ్బును దానంగా ఇవ్వడం కానీ లేదా అప్పుగా తీసుకోవడం కానీ చేయకండి..అని చెబుతున్నారు ఆధ్యాత్మిక పండితులు.. ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు అంటే ఇందులో ఏదో కచ్చితంగా నిగూఢ రహస్యం దాగి ఉంటుంది.. అది ఏంటో మనం కూడా తెలుసుకుందాం..


ఇక ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం మంగళవారం రోజున తీసుకున్న రుణాలు లేదా ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నట్లయితే వాటిని తిరిగి చెల్లించడం చాలా కష్టం అవుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. అందుకే వారంలో ఏ రోజు అయినా  మీరు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న లేదా ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నా ఎటువంటి సమస్య ఉండదు.. కేవలం మంగళవారం రోజు మాత్రమే ఎవరికీ డబ్బు ఇవ్వద్దు..అలాగే  ఎవరి దగ్గర డబ్బు అప్పుగా తీసుకోవద్దు. అంతేకాదు మంగళవారం రోజున కొత్త బట్టలు కూడా కొనుగోలు చేయడం లేదా ధరించడం కూడా చేయవద్దు అని అంటారు.


ఒకవేళ పండుగలు వస్తే ..ఎలా అని మీరు సందేహ పడితే కొత్త బట్టలపై , కొన్ని నీళ్లు చల్లి ఆ తర్వాత వాటిని ధరిస్తే ఎటువంటి దోషం ఉండదట. ఒకవేళ అలా కాకుండా మీరు కొత్త బట్టలు మంగళవారం రోజున ధరించినట్లయితే , అవి ఏదో ఒక కారణం చేత చిరిగి పోవడం లేదా రంగు వదిలి పోవడం లాంటివి జరుగుతాయి.. ఈ మంగళవారం ముఖ్యంగా శనితో సంబంధం ఉంటుంది కాబట్టి కొత్త దుస్తులతో పాటు మరేవీ కూడా కొత్తవి ధరించకూడదు.. డబ్బు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కాబట్టి మంగళవారం తప్పించి, వారంలో మిగతా రోజులలో మీకు నచ్చిన పని చేయడం అత్యంత శుభప్రదం అట.


మరింత సమాచారం తెలుసుకోండి: