కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత చాలా మంది ఉద్యోగులు బయటికి వెళ్ళ లేక వర్క్ ఫ్రం హోం పేరిట ఇంట్లోనే ఉద్యోగం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగాల లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా తమ యజమానుల సలహాల మేరకు ఇంటి నుంచి ఉద్యోగం చేస్తూ జీతభత్యాలను పొందుతున్నారు.. అయితే ఇకపై మీరు కూడా శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం పేరిట ఇంట్లోనే ఉద్యోగం చేయాలనుకుంటున్నారా.? అయితే మీ యజమాని మీకు ఇచ్చే హౌస్ రెంట్ అలవెన్స్ ను కూడా పూర్తిగా తగ్గించే అవకాశం ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.. ఇక ఎవరైతే మెట్రో నుండి నాన్ మెట్రో కి మారి ఇంట్లోనే ఉద్యోగం చేస్తున్నారో అలాంటి వారికి హౌస్ రెంట్ అలవెన్స్ కట్ చేసే అవకాశం 90 శాతం ఉన్నట్లు సమాచారం.


చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి ఉద్యోగం చేసే అవకాశాన్ని కల్పించాయి.. కాకపోతే మరి కొన్ని కంపెనీలు ఆఫీసుకు వచ్చి పని చేయాలని చెప్పిన విషయం తెలిసిందే.కొన్ని  కంపెనీలు కొత్త కొత్త వేరియంట్లు రావడంతో ఉద్యోగుల ఆరోగ్య రీత్యా ఇంటి నుంచి ఉద్యోగం చేసుకోమని కూడా సలహా ఇచ్చాయి.ఇక సరికొత్త పని వాతావరణానికి అనుగుణంగా వుండేలా జీతాల  స్వరూపాన్ని కూడా సవరించాలని ప్రభుత్వం భావిస్తోందట. అటు ఉద్యోగులు, ఇటు యజమానులకు కూడా  ఇబ్బందులు లేకుండా మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.


ఇక ప్రస్తుతం ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు మౌలిక సదుపాయాలు, ఇంటర్నెట్‌ ,కరెంటు తో సహా ఇతర ఖర్చులను  ఉద్యోగే స్వయంగా చెల్లించాల్సి వస్తోంది.  అయితే వీటిని యజమాని చేత ఇప్పిస్తారని తెలిసింది. అలాగే టైర్-2, టైర్‌-3 నగరాల్లో ఉద్యోగి నివసిస్తే.. అది ప్రతిబింబించేలా పరిహారం కింద  ప్యాకేజీని కూడా మారుస్తారు. ముఖ్యంగా ఈ ప్రభావం హెచ్‌ఆర్‌ఏ పైనే ఎక్కువ ప్రభావం పడనుంది. నిజం చెప్పాలంటే మనకిచ్చే హెచ్ఆర్ఏ అలవెన్స్ ను కట్ చేసి.. ఇంటర్నెట్ ,కరెంటు ,మౌలికవసతుల రూపంలో యాడ్ చేయనున్నట్లు సమాచారం..కాబట్టి ఈ హెచ్ఆర్ఏ కి సంబంధించిన పూర్తి వివరాలను కూడా త్వరలోనే వెల్లడిస్తామని ప్రభుత్వం తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: