ఈ డబ్బుని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అయిన కోనసీమ జిల్లాలోని అమలాపురంలో ఏపీ సీఎం బటన్ నొక్కి నేరుగా ఈ డబ్బులను మహిళల ఖాతాలో జమ చేయబోతున్నట్లు తెలుస్తోంది.వైయస్సార్ సున్నా వడ్డీ పథకం కింద ఇప్పటివరకు రూ.4,969.05 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. పేద అక్క చెల్లెమ్మలకు పాదయాత్రలో తెలిపిన విధంగా సున్నా వడ్డీకే రుణాలు అందిస్తున్నట్లు తెలియజేశారు. వారి జీవన ప్రమాణాలకు ప్రభుత్వం చేస్తున్న పని ఇది అన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోని బ్యాంకు రుణాలు సరైన సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాలలోని మహిళలు అందరికీ కూడా వడ్డీ భారం పడకుండా వారి తరఫున ఆ భారాన్ని వైయస్సార్ సున్నా వడ్డీ కింద ఏపీ ప్రభుత్వమే నేరుగా నగదును ఆయా బ్యాంకుల ఖాతాలో ప్రభుత్వం జమా చేయబోతున్నట్లు తెలియజేస్తోంది
అయితే అక్క చెల్లెమ్మలందరికీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడేలా జీవనోపాధిని మెరుగుపరిచేలా పలు దిగ్గజ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని.. వైయస్సార్ కాపు నేస్తం ,వైయస్సార్ చేయూత, ఈబీసీ నేస్తం తదితర వాటితో సున్నా వడ్డీ పథకాలను అభివృద్ధి చేసే విధంగా వైయస్ జగన్ ప్రభుత్వం పలు రకాల నిర్ణయాలు తీసుకున్నది. వడ్డీ రేటు తగ్గింప చేయడంతో పాటు ఏటా 30 వేల కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందుకొని చాలామంది మహిళలు వ్యాపారాలు చేసుకుంటూ 99.67 శాతం మంది రుణాల రికవరీలో చెల్లిస్తూ ప్రధాన స్థానంలో మహిళలు నిలిచారని తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి