అలాగే ఆరోగ్యశ్రీ వైద్య చికిత్స పరిమితి 25 లక్షలకు సైతం పెంచుతూ పలు రకాల ఉత్తర్వులను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.వీటన్నిటితో పాటు పలు సంస్థలకు ప్రభుత్వ భూమిని కేటాయించిన విషయంలో కూడా ఆమోదాన్ని తెలియజేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలియజేస్తోంది. వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే 3000 వేల రూపాయల పెన్షన్ హామీ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి అమలు చేశామని తెలియజేస్తున్నారు. ప్రతిఏటా 250 రూపాయలను పెంచుకుంటూ పోతామని తెలియజేశారు.
ఇందులో భాగంగా వచ్చే ఏడాది జనవరి 1 నాటికి ఒంటరి మహిళ వివిధ వృత్తులలో పింఛన్ పొందుతున్న వారికి 3000 రూపాయల వరకు పెంచబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రైతుల వెంట నష్టం పైన కూడా అంచనా వేసి అందుకు తగ్గట్టుగా ఆర్థిక సహాయాన్ని సైతం అందించే విధంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది ఏపీ ప్రభుత్వం. అంతేకాకుండా గ్రామాలలో కులాయిల ఏర్పాట్లకు కాంట్రాక్టులు డ్వాక్రా మహిళలకు సంఘాలకు ఇచ్చే విషయం పైన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ క్యాబినెట్లో పలు రకాల నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన విషయాలను సైతం సాయంత్రం లోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. ఈసారి ఎన్నికలలో తమ హవా చూపించాలని చూస్తోంది వైసీపీ ప్రభుత్వం..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి