ఆంధ్రప్రదేశ్లోనూ రైతులను ఆదుకునేందుకు వైసిపి ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో రకాల వాటిని ప్రవేశ పెడుతూ ముందుకు వెళ్తున్నారు.. ఇప్పుడు మరొకసారి రైతుల కోసం రైతుల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నారు.. దేశానికి వెన్నెముకగా నిలిచిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టాన్ని అందించబోతున్నారు.. మీ చాంగ్ తుఫాను వల్ల..2023-24 రవి సీజన్లో ప్రారంభమైన ఈ విపత్తుకు పంట నష్టం కలిగింది. పంట నష్టపోయిన రైతులకు సైతం నష్టపరిహారం చెల్లించేందుకు వైసిపి ప్రభుత్వం సిద్ధమయ్యింది..


ప్రకృతి వైపర్యాల కారణాలవల్ల 12 లక్షల మంది రైతులు నష్టపోయారని గుర్తించిన ఏపీ ప్రభుత్వం వారందరిని ఆదుకునేందుకు.. రూ.1,294,58 కోట్ల రూపాయలను విడుదల చేయబోతున్నారు.. ఈ రోజున తాడేపల్లి కార్యాలయంలో అందుకు సంబంధించి బటన్ నొక్క పోతున్నారు. రైతులకు సహాయం అందించే విధంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మీ చాంగ్ తుఫాన్ కారణంగా 22 జిల్లాలలో దాదాపుగా 6,64,380 ఎకరాలలో 33% పైగా పంటలు దెబ్బతిన్నాయని అధికారులు తెలుపుతున్నారు.


4.61 లక్షల మంది రైతులకు..442.36 కోట్ల రూపాయలు రావాల్సి వున్నది.. ఖరీఫ్ సీజన్లో దాదాపుగా 5000 ఎకరాలలో పంటలు నష్టపోయారు.. దీంతో ఐదు కోట్ల రూపాయల పంట నష్టపరిహారాన్ని రిలీజ్ చేయబోతున్నారు. మొత్తం మీద 20,93,377 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగిందట.. అయితే కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన దానికి మించి మరి సహాయం చేయాలని లక్ష్యంతోనే ఏపీ సీఎం జగన్ పలు రకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు.. అయితే వ్యవసాయ భూములలో ఇసుక దిన్నెలు మట్టి తొలగింపుకు హెక్టార్కు 12000 కేటాయించక ఇప్పుడు దానిని 18 వేలకు పెంచేశారు.. అదేవిధంగా వర్షాధారణంగా నష్టపోయిన పంటకు హెక్టార్కు 6,800 నుంచి 8500 కు పెంచారు.. నీటిపారుదల ప్రాంతాలలో ఉన్న వారికి 13,500 నుంచి 17వేలకు పెంచారు.. ఈ రోజున మధ్యాహ్నం 3 గంటలకు రైతుల ఖాతాలు డబ్బు జమ చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: