ఈపీఎఫ్ అనేది ఉద్యోగి అయిన ప్రతి ఒక్కరికి ఎన్నో సందర్భాలలో ఉపయోగపడుతూ ఉంటుంది. ఈపీఎఫ్ డబ్బులను ఎన్నో రకాలుగా మనం ఉపయోగించుకుంటూనే ఉన్నాము. అయితే ఇప్పుడు తాజాగా ఈపీఎఫ్ నిధులను ఇప్పుడు వైద్య ఖర్చులకు కూడా ఉపయోగించుకోవచ్చట. ఈపీఎఫ్ ఖాతా నుంచి సెక్షన్ 68J కింద విత్డ్రా చేసుకోవచ్చని దీని కింద 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు పెంచారు. వైద్య చికిత్స విషయంలో ఒక లక్ష రూపాయల వరకు ఈపీఎఫ్ డబ్బులు సైతం ఎవరైనా క్లైమ్ చేసుకోవచ్చట.


ఏప్రిల్ 16వ తేదీ నుంచి ఈ ఉపసంహరణ పరిమితిని పెంచుతున్నట్లు ఉత్తర్వులను కూడా జారీ చేశారు. ఏప్రిల్ 10వ తేదీన ఈపీఎఫ్ యాప్ సాఫ్ట్వేర్ లో పలు రకాల మార్పులను కూడా చేసినట్లు తెలుస్తోంది..cpfc లో కూడా ఈ మార్పున ఆమోదించారు.. వివిధ ప్రయోజనాల కోసం ఈపీఎఫ్ ఖాతాలో డబ్బును విత్డ్రా చేసుకోవాలంటే ఫారం 31 ద్వారా ఉపయోగించుకోవచ్చట... వివాహానికి సంబంధించి, ఇంటి కొనుగోలు ,ఇంటి నిర్మాణం ,వైద్యం ఇలా రకరకాల కారణాల జాబితాలు ఈపీఎఫ్ లో ఉన్నాయి..


అయితే వైద్య ఖర్చు కోసం ఈపీఎఫ్ నిధులు ఫారమ్ లో 68J కింద ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఈపీఎఫ్ సభ్యుడే కాదు అతని కుటుంబంలోని వ్యక్తులు కూడా అనారోగ్య సమస్య కారణంగా కొంటె వైద్య చికిత్స కోసం వీటిని ఉపయోగించుకోవచ్చట. అయితే దరఖాస్తు ఫారమ్ -31 తో పాటు ఈపీఎఫ్ ఖాతాదారుని పనిచేసే సంస్థ వైద్య చికిత్స డాక్టర్ సంతకం కచ్చితంగా ఉండాలంటూ తెలియజేశారు.. అయితే ఈపీఎఫ్ ఫారం 31 కింద పలు రకాల కారణాల చేతన డబ్బులు అయితే ఉపసంకరించుకోవచ్చు.68B కింద ఫ్లాట్ కొనుగోలు.. 68 BB కింద రుణం చెల్లింపు..68J కింద వైద్య చికిత్స..68H కింద ప్రత్యేక సందర్భం కోసం..68K కింద పిల్లల వివాహం విద్యాకర్చుల కోసం.68N కింద పరవి విరమణ ఒక సంవత్సరం ముందు వరకు డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: