హరీష్ శంకర్ చేయబోయే సినిమా గురించి మాత్రం ఎవరికీ ఏమీ తెలియదు.. కాన్సెప్ట్ పోస్టర్ అంటూ పవన్ బర్త్ డేకి విడుదల చేసిన పోస్టర్ గురించి కూడా పవన్ స్పందించలేదు. ఆ పోస్టర్ ద్వారా ఇది కమర్షియల్ సినిమానే కానీ సోషల్ మెసేజ్ ఉంటుందని హరీష్ తెలియజేసాడు. అంతకు మించి ఆ సినిమా గురించి ఇప్పుడే మాట్లాడడం కరెక్ట్ కాదని వెయిట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో పవన్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడని, గబ్బర్ సింగ్ మాదిరిగానే పవన్ ని పోలీస్ పాత్రలో విలక్షణంగా చూపించడానికి హరీష్ ప్లాన్ చేస్తున్నాడని కొందరు అంటున్నారు..