వకీల్ సాబ్ రావడానికి లేట్ అవుతుందని క్రిష్ వైష్ణవ తేజ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. డిసెంబర్ లోగా ఈ సినిమా ని పూర్తి చేసిన పవన్ తో సినిమా చేయాలన్నది క్రిష్ ఆలోచన.. అయితే ఈ విషయాన్ని పవన్‌కు కూడా చెప్పేశాడట. ‘వకీల్ సాబ్’ సినిమాను నవంబరుకల్లా పూర్తి చేసి, డిసెంబరుకు రెడీగా ఉంటే.. షూటింగ్ పున:ప్రారంభిద్దామని.. ఈ మేరకు మిగతా నటీనటులు, టెక్నీషియన్ల డేట్లు కూడా సర్దుబాటు చేసుకుంటున్నామని పవన్‌కు క్రిష్ చెప్పేశాడట. నిర్మాత రత్నం ఆధ్వర్యంలో అందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. మరి క్రిష్ కోరుకున్నట్లు పవన్ డిసెంబరుకల్లా ఈ సినిమా కోసం రెడీగా ఉంటాడో లేదో చూడాలి.