తొలి సినిమా గమ్యంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ క్రిష్.. తొలి సినిమా తోనే ఆయనకు టాలీవుడ్ లో అవార్డుల పంట పండింది.. లైఫ్ గురించి ఈ సినిమా లో ఆయన వర్ణించిన తీరు చూసి టాలీవుడ్ కి టాలెంట్ ఉన్న దర్శకుడు దొరికాడని అనుకున్నారు.. అనుకున్నట్లుగానే రెండో సినిమా వేదం తో మర్చిపోలేని సినిమా చేశాడు.. అల్లు అర్జున్, మంచు మనోజ్ ల కెరీర్ లో నే ఆ సినిమా ది బెస్ట్ సినిమా గా నిలిచిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఆ సినిమా తో క్రిష్ పేరు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ మారుమోగిపోయింది.. ఈ సినిమా తరువాత క్రిష్ కు టాలీవుడ్ పెద్ద హీరోల దగ్గరినుంచి పిలుపు వస్తునానుకున్నారు కానీ అలా జరగలేదు. వరుణ్ తేజ్ తో కంచె సినిమా చేశాడు.