బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎన్నో ఏళ్ళనుండి పెండింగ్ లో ఉన్న తీర్పులకు మోక్షం లభించింది. అందులో ఒకటి అయోధ్య రామ మందిర నిర్మాణం.. గత ప్రభుత్వాలు ఇలాంటి కేసులని పరిష్కరించాలని ప్రయత్నించినా రాజకీయ వత్తిడుల మేరకు దాన్ని మధ్యలోనే ఆపేసింది. దేశంలో దశాబ్దాల నుంచి పెండింగ్ లో ఉన్న ఈ అయోధ్య రామ మందిరం నిర్మాణానికి ఇటీవలే సుప్రీమ్ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. రామ మందిర నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్లు సుప్రీమ్ కోర్టు స్వయంగా తీర్పు ఇచ్చింది.