ఆంధ్రప్రదేశ్లో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వెళ్లారని, వాటిని స్వీకరించడానికి అధికారులు లేరని దేవినేని ఉమ అన్నారు. దీనిపై వెంటనే రాష్ట్రపతి, గవర్నర్ లు స్పందించాలని కోరారు. స్థానిక సంస్థ ఎన్నికలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.