మోహన్ బాబు నటవారసుడిగా సినీఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ హీరోగా సెటిల్ అవడానికి చేయని ప్రయత్నం లేదు. కానీ అదృష్టం ఆయన్ని వరించలేదు.. మరోవైపు పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవడంతో అయన కొన్ని రోజులు సినిమా లకు దూరంగా ఉన్నారు.. రాజకీయాలవైపు వెళతా అనుకున్నారు.. కానీ మళ్ళీ సినిమాల్లోకి వచ్చి అహం బ్రహ్మాస్మి అనే సినిమా ని మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో తమిళ బ్యూటీ ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా చేస్తోంది.