ఇష్క్ సినిమా తో మళ్ళీ కామ్ బ్యాక్ చేసిన నితిన్ ఆ తర్వాత వరుస హిట్ల తో దూసుకుపోతున్నాడు.ఇటీవలే భీష్మ తో సూపర్ హిట్ అందుకున్న నితిన్ ప్రస్తుతం రంగ్ దే సినిమా చేస్తున్నాడు.. వెంకీ అట్లూరి ఈ సినిమా కి దర్శకుడు.. న్యూ ఇయర్ సందర్భంగా నితిన్ రంగ్ దే టీమ్ కొత్త విడుదల తేదీని ప్రకటించింది. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు అఫీషియల్ గా చెప్పేసింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మీద యూత్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఇప్పటికే మంచి పబ్లిసిటీ కూడా వచ్చేసింది.