నిజానికి ఇప్పటివరకు ఇలాంటి ప్రయత్నం ఎవరూ చేయలేదు. థియేటర్లలో రిలీజ్ అయ్యి సూపర్ గా ఆడిన సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేసినా, లేదు ఫ్లాప్ టాక్ తెచ్చుకుని వెళ్లిపోయిన సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసిన సరే ఎప్పుడూ ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేయడం లేదు. అయితే ఈ సినిమాకు ఎందుకలా హడావిడి చేస్తున్నారు అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. నిజానికి ఈ సినిమా చాలా మందికి నచ్చలేదని ముందు సోషల్ మీడియా వేదికగా ఒప్పుకున్న హీరో కార్తికేయ ఈ సినిమాకు ఒక వర్గం నుంచి మాత్రం ప్రశంసలు దక్కాయి అని చెప్పుకొచ్చాడు.