ఈ మద్య సినిమా ఇండస్ట్రీకి పెను భూతంలా పట్టి పీడిస్తుంది..పైరసీ. ముఖ్యంగా టెక్నాలజీ ఎంతగా పెరిగిపోతుందో..సినిమా ఇండస్ట్రీకి అంత నష్టం కూడా వాటిల్లుతుందని ఇప్పటికే పలు సంఘటనలు నిరూపించాయి. చిన్న సినిమా నుంచి కోట్లు వెచ్చించి తెరకెక్కించిన పెద్ద సినిమాల వరకు థియేటర్లోకి రాకముందే నెట్ లో ప్రత్యక్షం అవుతున్నాయి. గతంలో తెలుగులో త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్ లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ ఏకంగా నెల రోజుల ముందు నెట్ లో ప్రత్యక్షం అయ్యింది.
బాహుబలి యుద్ద సంఘటనలు నెట్ లో రిలీజ్ లీక్ అయ్యాయి..కొన్ని బాలీవుడ్ చిత్రాలు కూడా రిలీజ్ కి ముందే నెట్ లో ప్రత్యక్షం అయ్యాయి. ఆ మద్య రజినీకాంత్ నటించిన ‘కబాలి’ చిత్రం కూడా నెట్ లో లీక్ అయ్యింది. ఇలా ఏలాంటి సినిమాలైనా థియేటర్లో రిలీజ్ కావడం..గంటల వ్యవధిలో నెట్ లో హల్ చల్ చేయడం కామన్ అయ్యింది. తాజాగా చాలా రోజులుగా ఊరిస్తూ వస్తున్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్ లైట్ ఈ శుక్రవారం విడుదల అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాల మద్య రిలీజ్ అయ్యింది.
బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో దూసుకుపోతున్న సల్మాన్ 'సుల్తాన్' తర్వాత.. 'బజరంగీ భాయ్‌జాన్' దర్శకుడు కబీర్ ఖాన్ దర్శకత్వంలో 'ట్యూబ్‌లైట్' తెరకెక్కించడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాలో అత్యంగ కీలకమైన సన్నివేశాలు నెట్ లో ప్రత్యక్షం కావడంతో చిత్ర యూనిట్ షాక్ తిన్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ బాద్ షా ఉన్న విషయం చాలా సీక్రేట్ గా దాచారు చిత్ర యూనిట్..అయితే ఈ సన్నివేశం లీక్ కావడంతో అంతా షాక్ తిన్నారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 'ట్యూబ్‌లైట్' సినిమాలో అతిథి పాత్ర పోషిస్తున్నాడు. ఆయన ఇందజాలికుడిగా కనిపించి పిల్లలను అలరించే కీలక సీన్ ఆన్లైన్లో లీక్ అయింది. ఈ సీన్ అభిమానులను అలరిస్తుండటంతో వెంటనే వైరల్‌గా మారింది.