ఒకప్పుడు ఒక సినిమా ఎన్ని రోజులు ఆడితే అంత పెద్ద హిట్ గా  పరిగణించేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయి ఒక సినిమా మొదటి వారంలో ఎన్ని కోట్లు వసూల్ చేసింది అనే విషయమై ఆ సినిమా సక్సస్స్ ను నిర్ణయిస్తున్నారు. చరిత్రసృష్టించిన ‘బాహుబలి’ లాంటి సినిమా కూడ 100రోజులు అడిన థియేటర్స్ సంఖ్య అతి తక్కుగా ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులలో నందమూరి బాలకృష్ణ నటించిన ‘జై సింహ’ సినిమాకు సంబంధించి నిన్న విడుదల చేసిన 50రోజుల పోష్టర్ పై సెటైర్లు పడుతున్నాయి. 
BALAKRISHNA IN JAISIMHA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈమూవీ గత జనవరి జనవరి 12న సంక్రాంతిని టార్గెట్ చేస్తూ విడుదలైన  విషయం తెలిసిందే. ఈ సినిమాకుసంబంధించి   రెండు వారాలు క్రితమే సినిమా కలెక్షన్స్ అన్ని క్లోజ్ చేసేయడం  జరిగిపోయింది. ప్రస్తుతం ఈసినిమా మన ఇరు రాష్ట్రాలలోని ఏ ప్రముఖ సెంటర్ లో ఆడుతున్న విషయానికి సంబంధించిన వార్తలు ఎక్కడా లేవు. కానీ ఇప్పుడు ఈ సినిమా 50 డేస్ అంటూ ఒక పబ్లిసిటీ పోస్టర్ ను మీడియాకు విడుదల చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 
BALAKRISHNA IN JAISIMHA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనికితోడు ఇప్పుడు ఈపోస్టర్ ను విడుదలచేయడంతో అసలు ఈ  సినిమా ఏథియేటర్ లో ఆడుతోంది అంటూ చాలామంది ఆశ్చర్య పోతున్నారు. నిజానికి ఈసినిమా రిలీజ్ అయి 50రోజులు అయిన మాట వాస్తవమే అయి ఉండచ్చుగాని ప్రస్తుతం ఈసినిమా ఎక్కడా ప్రదర్శింప పడటం లేదనివిశ్లేషకుల వాదన. ఈమూవీ ఓవరాల్ గా 29కోట్ల  కలెక్షన్స్ వసూల్ చేసినట్లు ఇప్పటికే వార్తలు ఉన్నాయి. 
BALAKRISHNA IN JAISIMHA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనికితోడు ఏదో ఒక చిన్న ఊరిలోని థియేటర్ లోఈ సినిమా ఇంకా ప్రదర్శింప బడుతోంది అని భావించుకోవాలి అన్నా నిన్నటి నుండి మన తెలుగు రాష్ట్రాలలో  థియేటర్లు బంద్ ఉన్న నేపధ్యంలో ఒక్క థియేటర్ కూడా తెరిచిలేని పరిస్థితులలో ఈ మూవీ ఏ ధియేటర్ లో 50 రోజులు  ప్రదర్శింప పడింది అని సెటైర్లు పడుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఈసినిమాను తీసిన నిర్మాత సి. కళ్యాణ్ కు ఈ సినిమా వల్ల కొద్దిగా లాభాలు పొందినా ఆ లాభాలు అన్ని సాయి ధరమ్ తేజ్ తో తీసిన ‘ఇంటలిజెంట్’ సినిమాతో పోగొట్టుకోవడమే కాకుండా మరింత తీవ్ర నష్టాలు పొందిన నేపధ్యంలో నిర్మాత కళ్యాణ్ మళ్ళీ బాలయ్యతోనే మరో సినిమాను తీసి ఆ నష్టాల నుండి బయట పడటానికి చేస్తున్న ప్రయత్నాలకు బాలకృష్ణ ఎంతవరకు సహకరిస్తాడో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: