"సమాజంలో ఆడవాళ్లపై ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి. ఒక్కసారి ‘మహానటి’ చూశాక, ఎందుకు మగాడిగా పుట్టాం అనిపిస్తుంది. ఆడవాళ్ల బలం ఏమిటో చెప్పే సినిమా ఇది. వాళ్లు తలచుకుంటే ఏం సాధిస్తారో అర్థమవుతుంది. ఈ సినిమా చూశాక వాళ్లపై గౌరవం పెరుగుతుంది" అని అన్నారు నందమూరి తారక రామారావు, తారక్. సావిత్రి జీవితాన్ని అందులో ఇసుమంత కథ తయారు చేసి "మహానటి" పేరుతో వెండితెరపై ఆవిష్కరించారు. ఇసుమంత కథ ఎందుకంటే - మొత్తం కథ చెప్పాలంటే ఒక వెయ్యి ఎపిసోడ్లుగాతెరకెక్కించాలి అది అసంభవం.

mahanati audio launch కోసం చిత్ర ఫలితం

కీర్తి సురేష్‌, సమంత, దుల్కర్‌ సల్మాన్‌, విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలు పోషించగా నాగ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రియాంక దత్‌ నిర్మాతగా ఈ సినిమా తయారైంది. మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందించిన ఈ చిత్రం లోని గీతావిష్కరణ ఒక మహాద్భుత సమావేశలో మంగళవారం రాత్రి హైదరాబాద్‌ లో విడుదల అయ్యాయి.

mahanati audio launch కోసం చిత్ర ఫలితం

తొలి సీడీని ఎన్టీఆర్‌ ఆవిష్కరించి మహానటి సావిత్రి కుమారుడు సతీష్‌, కుమార్తె విజయ చాముండేశ్వరి కి అందించారు. అనంతరం ఎన్టీఆర్‌ మాట్లాడుతూ "సావిత్రిగారి హుందాతనం గురించి, గొప్పదనం గురించి మాట్లాడే అర్హత ఎన్ని జన్మలెత్తినా కూడా రాదు. నిజమైన సూపర్‌ స్టార్‌ ఆమె. తాను ఎలా జన్మించారు, ఎలా చనిపోయారు అనేదానికంటే ఎలా జీవించారన్నదే "కళ్లకు కట్టి నట్టు చూపించే చిత్రం మహానటి" అని కొనియాడారు.

mahanati audio launch కోసం చిత్ర ఫలితం

కొంతమంది జీవితం గురించి తెలుసుకోవడం, అందులోని అద్భుతాలను ఆదర్శంగా తీసుకోవడం ఆపై అనుసరించగలిగితే అనుసరించటం చాలా అవసరం. అలాంటి ఒక అద్భుతమైన వ్యక్తి జీవితాన్ని కళ్లకు కట్టి నట్టు మన ముందుకు తీసుకుని రాబోతున్నారు నాగ అశ్విన్‌. ఒక దర్శకుడిగా కాకుండా ఒక మహానటి సావిత్రి వీరాభిభిమానిగానే ఆయన ఈ సినిమాని తీసుంటాడని అనుకుంటున్నాను అని అన్నారు. నాగ్‌ 'కన్న ఈ కల' ను వైజయంతి అశ్వనీ దత్‌ గారు తప్ప ఇంకెవ్వరూ నిజం చేయలేరేమో అనిపిస్తుంది. ఒక గొప్ప విషయం చెప్పబోతున్నప్పుడు దానిని తలపెట్టినప్పుడు మనం దేని గురించీ వెదుక్కోవాల్సిన అవసరం లేదు. అన్నీ కళ్ల ముందుకు అవే నడచి వచ్చేస్తాయి. ఆ సంకల్పం నెఱవేర్చటం ప్రకృతి స్వభావం. దైవానికి ప్రకృతికి భేధంలేదు. ప్రకృతే దైవం. నటీనటుల్ని, సాంకేతిక నిపుణులనే కాదు ఆ వాతావరణన్ని కూడా ప్రకృతే అందింస్తుంది. అదే జరిగిందిప్పుడు.

mahanati audio launch కోసం చిత్ర ఫలితం

చిరస్మరణీయంగా మిగిలిన గొప్ప వాళ్లు దైహికంగా  మనల్ని వదిలేసి పోయినా వారి ‘ఆరా’ అంటే ఆత్మ మన చుట్టూ వలయాలుగా ఏర్పడి తిరుగుతూనే ఉన్టుంది, మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది.  సావిత్రి ఆత్మ పట్టు బట్టి మరీ తన సినిమా తీయించిందేమో? అనిపిస్తోంది.  స్వప్న (అశ్వినీదత్ తనయ) ఓసారి నా దగ్గరకు వచ్చి ఈ సినిమాలో తాత గారి వేషం వేయమని అడిగింది. ఆయన వేషం వేసే అర్హత నాకు లేదు. ఆయన పాత్ర పోషించడం ఈ జన్మలో జరగని పని. ఆ పాత్ర పోషించే దమ్ము దన్ను నాకు లేదు అన్నారట”తారక్.

savitri keerti suresh కోసం చిత్ర ఫలితం

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ "ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, సావిత్రి ఈ మూడు పేర్లూ తెలుగు చలన చిత్ర]చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడి చిరస్మరణీయ మౌతాయి. వాళ్లు లేకుండా మాయాబజార్‌ లేదు. ఎన్నో గొప్పగొప్ప సినిమాలూ లేవు. నా ఎనిమిది నెలలవయసులో నన్నుఎత్తుకుని చిత్రసీమకు “వెలుగు నీడల” సినిమాద్వారా పరిచయం చేశారు మహానటి సావిత్రి. బయోపిక్‌ తీయాలి అంటే తీసేవాళ్ళకు ఆ అర్హత ఉండాలి. అది అతి తక్కువ మందికే ఉంటుంది. ఆ గౌరవం సావిత్రి గారికి దక్కింది.

సంబంధిత చిత్రం

 తెలుగులో తీసిన తొలి బయోపిక్‌ "ఒక స్త్రీ కథ" కావడం చాలా గర్వంగా ఉంది. తెలుగు చిత్రసీమ మగువలకు ఇచ్చే గౌరవానికి ఈ మహానటి సినిమా ఒక చిహ్నం. ఇంత మంచి చిత్రం లో నేను లేనన్న బాధ నన్ను మెలిపెడుతూ ఉంది. అయితే నా కొడుకు నాగ చైతన్య, నా కోడలు పిల్ల సమంతలు భాగస్వాములు కావడం సంతోషంగా ఉంది అని  అన్నారు.

సంబంధిత చిత్రం

జెమినీ గణేషణ్ పాత్రధారి మళయాళ సూపర్ స్టార్ దుల్కర్‌ సల్మాన్‌ మాట్లాడుతూ "జెమిని గణేశన్‌, సావిత్రి గార్ల కు వీరాభిమానిని. వాళ్ల కథల్ని తెరపై తీసుకు రావడం, అందులో నేను నటించడం అమిత ఆనందంగా ఉంది. నాగికి (నాగ అశ్విన్ దర్శకుడు) ఇది రెండో సినిమా అంటే నమ్మ బుద్ధి కాలేదు. ఈ సినిమాతో చాలా మంది స్నేహితులు దొరికారు" అని ప్రేక్షక సమూహంవైపు చూస్తూ అన్నారు.

priyadarSini mirror in mayabazar కోసం చిత్ర ఫలితం

దర్శకేందృదు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ "సావిత్రి కథ తీయడం ఆనందంగా ఉంది. కానీ, నన్ను సంప్రదించకుండా ఈ సినిమా తీశారు. నా జీవితం మొదలైంది సావిత్రిగారి తోనే, అదీ ఆమె ద్రౌపతిగా నటించిన "పాండవ వనవాసం" చిత్రానికి నేను సహాయదర్శకుడిగా పనిచేశాను. మే 9కోసం మహానటి సినిమా చూడటానికి ఆత్రుతగా ఆసక్తిగా ఎదురుచూస్తాను" అని అన్నారు.

mahanati audio launch కోసం చిత్ర ఫలితం

ప్రసిద్ధ సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ "సావిత్రి గారి కథని డాక్యుమెంటరీగా తీసినా 60గంటలొస్తుంది. అలాంటి కథలో ఆరుపాటలు పెట్టాల్సిన అవసరం ఏమిటి అనే విషయంపై ఒక తపస్సే జరిగింది. కీర్తి సురేష్‌ని చూస్తే సావిత్రిగారు ఆమెలోకి ప్రవేసించారా? ఆమెను ఆవహించారా? అనిపిస్తుంది. కీర్తి సురేష్‌ ను సావిత్రి నెం.2గా చూస్తామని" అన్నారు.

mahanati audio launch కోసం చిత్ర ఫలితం

యువ నటుడు నాని మాట్లాడుతూ, "కీర్తి, నాగ్‌ అశ్విన్‌, సమంత, విజయ్‌ దేవరకొండ వీళ్లంతా నాకు బాగా కావాల్సినవాళ్లే. ఈ సినిమాలో నేను లేనే అనే బాధ ఉంది" అని అన్నారు.

mahanati audio launch కోసం చిత్ర ఫలితం

కీర్తి సురేష్‌ మాట్లాడుతూ "నాగి, స్వప్ననా దగ్గరకు వచ్చినప్పుడు 'ఈ పాత్ర నేను చేయలేను' అని చెప్పేశాను. కానీ నాగి నాలో నమ్మకాన్ని కలిగించారు. ఆయన్ని చాలా సందేహాలు అడిగే దాన్ని. కొన్నింటికి మహానటి సావిత్రిగారి తనయ విజయ చాముండేశ్వరి గారి సలహాలు తీసుకున్నా. ఈ చిత్రంలో నేను కథానాయికని కావొచ్చు. కానీ ఈ కథ ని నడిపే స్టార్‌ మాత్రం సమంతనే - అంటే హెరోయిన్ ని నడిపే స్టార్ సమంత అన్నమాట" అని అంటూ “మొదట నాని ద్వారా  ఈ సినిమా గురించి విన్నాను. నాగీ, స్వప్నా నా దగ్గరకి వచ్చి, నువ్వు టైటిల్‌ రోల్‌ చేయాలన్నారు. నేను సావిత్రిగారి పాత్ర చేయడమేంటి? అను కున్నాను. కానీ నాగీ కాన్ఫిడెన్స్‌ ఇచ్చారు. మనం సావిత్రిగారికి ఇచ్చే నివాళి అని చెప్పారు. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్‌ నాగీ.  సావిత్రి గారు ఎక్కడున్నా మమ్మల్ని ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను’’ అన్నారు.

mahanati audio launch కోసం చిత్ర ఫలితం

సమంత ఉద్వేగంగా మాట్లాడుతూ "ఇలాంటి ఒక గొప్ప చిత్రంలో నాకూ అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది. ఈ పాత్ర ఒప్పుకుని చిన్న సాహసం చేశాను. ఇందులో నేను నాయికని కాదు. కానీ ఒక సన్నివేశం కోసం ఒప్పుకోవాలని అనిపించింది. ఆ సన్నివేశం కోసమే నేను నా పాత్రకు డబ్బింగ్‌ చెప్పుకున్నా. అనేక సినిమాల్లో నటించిన అనుభవమున్నా ఈ సినిమాలో ఒక సన్నివేశంలో గ్లిజరిన్‌ కూడా వాడకుండానే కన్నీళ్లొచ్చాయి" అన్నారు భారమైన మనసుతో.

mahanati audio launch కోసం చిత్ర ఫలితం

చివరకు బుర్రా సాయిమాధవ్‌ మాట్లాడుతూ "డైలాగులు రాస్తూ ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నానో గుర్తే లేదు. ఈ ఒక్క సినిమా తోనే సావిత్రికి, ఎన్టీఆర్‌కి, ఎఎన్నార్‌కి, ఎస్వీఆర్‌కీ ఇలా ఎంతో మంది లెజెండ్స్‌కి మాటలు రాశాను. ఇలాంటి అవకాశం ఈ తరం లో మరో రచయితకు దొరకదేమో?" అన్నారు. "లోతైన కథ ఇది. దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఈ కథని ఎంచుకునే అర్హత రావడానికి కనీసం రెండేళ్ల పాటు పరిశోధన చేశాం. సావిత్రి పాత్రకు కీర్తి సురేష్‌ దొరికిన ప్పుడు సమంత దగ్గరకు వెళ్లాం. ఒక్క సన్నివేశం చెప్పగానే ఆమె నటించడానికి ఒప్పుకున్నారు. సెట్లో సావిత్రిగారు ఉన్నారేమో అనే భావనతో పనిచేశాను" అని అన్నారు దర్శకుడు నాగ అశ్విన్. ఈ కార్య క్రమంలో అశ్వనీదత్‌, ప్రియాంకా దత్‌, స్వప్న దత్‌, మాళవిక నాయర్‌, విజయ్‌  దేవరకొండ, మిక్కీ జె. మేయర్‌, రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

mahanati audio launch కోసం చిత్ర ఫలితం

స్వప్నా దత్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు చాలా మంది చాలా ప్రశ్నలు అడిగారు. సెన్సేషన్‌ కోసమా? ఎందుకు సావిత్రి అని? వర్కౌట్‌ అవుతుందా? అని. ‘ఎవడే సుబ్రమణ్యం’ చేసేప్పుడు సావిత్రిగారి జీవితకథ తీద్దామని నాగి అన్నాడు. నాగి మీద ఉన్న అతి నమ్మకం. దాని కంటే ముఖ్యంగా సావిత్రిగారి మీద ఉన్న నమ్మకం. సావిత్రిగారి కుటుంబ సభ్యులు ఎంతో ధైర్యం ఇచ్చారు. 45ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాం. ఎత్తుపల్లాలు చూశాం. వైజయంతి బేనర్‌కి రెస్పెక్ట్‌ తీసుకువచ్చే సినిమా. మమ్మల్ని నమ్మింది సమంత. ఒక హీరోయిన్‌ కథను మోసుకెళ్లటం అనే డెసిషన్‌ గ్రేట్‌. కీర్తీ సురేశ్, నేను.. ఇద్దరం సరదాగా గొడవపడేవాళ్లం’’ అన్నారు

సంబంధిత చిత్రం 

మరింత సమాచారం తెలుసుకోండి: