తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ 2 రోజు రోజుకీ ఉత్కంఠంగా సాగుతుంది.  ఈ సీజన్ కి నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.  ఈసారి బిగ్ బాస్ సీజన్ లో పదిహేడు మంది కంటిస్టెంట్స్ ఉండగా..ప్రస్తుతం ఆరుగురు మిగిలారు.  ఈ వారం టాస్క్ ల పరంగా ఇంటి సభ్యులు మద్య మాటల యుద్ద..ఒకదశలో కౌశల్, తనిష్ లు కొట్టుకునే పరిస్థితికి చేరుకుంది..దాంతో వీరిద్దరికీ బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే కౌశల్ తన కుటుంబం అంటే ఎంత ప్రేమ చూపిస్తాడో అందరికీ తెలిసిందే..ఆ మద్య కుటుంబ సభ్యులు హౌజ్ లోకి వచ్చినపుడు ఎంతో ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యాడు. 

ఇక బిగ్ బాస్ లో కామన్ మాన్ గా ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు రెండు పర్యాయాలు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.  అయితే మొదటి నుంచి కౌశల్ కి ఎంతో స్నేహంగా ఉన్న నూతన్ నాయుడు కౌశ‌ల్ ఫ్యాన్స్ నూత‌న్‌కి మ‌ద్ద‌తుగా నిలిచి అతనిని బిగ్ బాస్  హౌస్‌కి రెండో సారి పంపించిన సంగ‌తి తెలిసిందే.  నిన్న కౌశల్ కూతురు పుట్టిన రోజు.. సంద‌ర్భంగా నూత‌న్ నాయుడు కౌశ‌ల్ ఇంటికి వెళ్లి మ‌రి ఆ పాప‌ను ఆశీర్వ‌దించారు.
Image result for nutan naidu at koushal house
కౌశ‌ల్ కుతురు కోసం నూత‌న్ నాయుడు ప్రత్యేకంగా ఓ గిఫ్ట్‌ని తీసుకువెళ్లాడు.ఆ గిఫ్ట్ చూసిన కౌశ‌ల్ కుతురు క‌న్నీరు పెట్టుకుంద‌ట‌. నూత‌న్ నాయుడు స‌మ‌క్షంలో కౌశ‌ల్ భార్య నీలిమ కుతురు చేత కేక్ క‌ట్ చేయించింది. కౌశల్ గెలుపు కోసం అందరం ప్రార్ధన చేస్తున్నాం అని చెప్పాడు నూతన్ నాయుడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: