దీంతో తెలంగాణ నిరుద్యోగులలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. చాలా కాలంగా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇది పెద్ద ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. ప్రస్తుతం పెంచిన పోస్టులతో కలిపి మొత్తం మీద పోస్టుల విభాగాల విషయానికి వస్తే.. అగ్నిమాపక శాఖ లో 790 పోస్టులు కలవు, జైళ్ల శాఖలో 223 పోస్టులు, అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగంలో 1,424 పోస్టులు ఉన్నాయి. అలాగే సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 3,697 కలవు, ఏ ఆర్ కానిస్టేబుల్ పోస్ట్ 1052 కలవు. డ్రైవర్ పోస్టులు 20, మెకానిక్ పోస్టులు 25 పోస్టులతో పాటు మరికొన్ని కలవు.
అలాగే వీటితో పాటుగా 148 ఎస్సై పోస్టులు , ఏఆర్ ఎస్ఐ 14, రిజర్వ్ ఎస్ఐ 12 పోస్టులు కలవు. ఈ పోస్టులన్నిటికి త్వరలోనే వీలైనంత త్వరగా అధికారిక నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ తెలంగాణ పోలీస్ రిక్రూమెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు అధికారికంగా తెలియజేశారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకత్వం ఈ ప్రక్రియ జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రకటనతో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మరింత ఉత్సాహం నెలకొంది. అలాగే ఏళ్ల తరబడి చదువుతున్న నిరుద్యోగులకు కూడా ఇది గొప్ప అవకాశం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి