తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా సీనియర్ హీరోలు మల్టీస్టార్ మూవీస్ పైనే ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా వెంకటేష్ ఇప్పటికే పలు మల్టీస్టారర్ మూవీస్ లో నటించారు..నటిస్తున్నారు. మొదటి సారిగా తెలుగు లో అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని కలిసి నటిస్తున్న చిత్రం ‘దేవదాస్’. ఈ చిత్రం ముహూర్తం మొదలైనప్పటి నుంచి ఏదో రకంగా సోషల్ మీడియాలో నానుతూనే ఉంది. ఇక బిగ్ బాస్ సీజన్ 2 కి నాని హోస్ట్ కావడం..ఈ చిత్రంపై అప్పుడప్పుడు ప్రస్థావన తీసుకు రావడం..టీజర్ చూపించడంతో సినిమా ప్రమోషన్ బాగా కలిసి వచ్చింది.
గత మొన్నటి ఆదివారం నాగార్జున, హీరోయిన్లు బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి సందడి చేశారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వని దత్ నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా చోట్ల షోలు పడ్డాయి. యుఎస్ లో అయితే టాక్ కూడా బయిటకు వచ్చేసింది. యుఎస్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా జస్ట్ ఓకే. కేవలం నాని, నాగార్జున అనే కాంబినేషన్ తప్ప ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ఎలిమెంట్స్ ఏమీ లేవని అంటున్నారు. అంతే కాదు ఈ సినిమా ఆంగ్ల చిత్రం ఎనలైజ్ దిస్ కు ఓ పూర్ కాపీగా ఇది రూపొందని టాక్ వినిపిస్తుంది.
కాకపోతే దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాత్రం నాగార్జున, నాని ల మధ్య వచ్చే సీన్స్ బాగా రాసుకున్నాడని అవే ఉన్నంతలో సినిమాకు ప్లస్ అయ్యాయని చెప్తున్నారు. ఈ సినిమాలో పాటలు మూడు మాత్రం కాస్త ఆకట్టుకునే విధంగా ఉన్నాయని..మిగతావి పెద్దగా చెప్పుకోవడానికి లేదని అంటున్నారు. మొదట 15 నిముషాలు, సెకండాఫ్ లో చాలా చోట్ల బోర్ కొట్టిందని..నాని టైప్ కామెడీని ఎక్స్ పెక్ట్ చేసిన వారికి కాస్త నిరాశ తప్పదని అంటున్నారు. అయితే ఈ దేవదాస్ చిత్రం హిట్టా..ఫట్టా అనేది రేపటి కలెక్షన్లను బట్టి తెలిసిపోతుందని అంటున్నారు.