తెలుగు, తమిళ ఇండస్ట్రీలో పిజ్జా చిత్రంతో తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్ సేతుపతి తర్వాత తమిళ ఇండస్ట్రీలో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రంలో ఓ ప్రముఖమైన పాత్రలో కనిపించబోతున్నాడు విజయ్ సేతుపతి. ఈ మద్య మణిరత్నం దర్శకత్వంలో ‘నవాబ్’ చిత్రంలో కూడా కీలక పాత్రలో నటించాడు విజయ్ సేతుపతి.
అంతే కాదు తమిళంలో స్టార్ హీరోయిన్ త్రిషతో నటించిన ‘96’ కూడా అద్భుతమైన విజయం సాధించింది. విజయ్ సేతుపతి, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సూపర్ డీలక్స్’. ఈ చిత్రంలో ‘శిల్ప’ అనే ట్రాన్స్జండర్ పాత్రలో విజయ్ నటించాడని సమాచారం. ఫాహద్ ఫాజిల్, రమ్యకృష్ణ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ వస్తున్న విజయ్ సేతు పతి ఈ చిత్రంలో ఇలాంటి డిఫరెంట్ పాత్రలో నటించడం ఆసక్తి రేపుతుంది. ట్రాన్స్జండర్ పాత్రలో విజయ్ నటించాడని సమాచారం. ఫాహద్ ఫాజిల్, రమ్యకృష్ణ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.