భారత దేశంలో ఈ మద్య ‘మీ టూ ’ ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. అయితే ఈ ఉద్యమంలో బాగంగ సినీ, రాజకీయ, ఇతర రంగాల్లో ఉన్న మహిళలు గతంలో తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి బాహాటంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మందిపై కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా ఒకప్పటి మాలీవుడు శృంగార తార షకీలా గతంలో తనపై లైంగిక వేధింపులు జరిగాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
'ఏ అమ్మాయికైనా అలాంటి లైంగిక వేధింపులు, బెదిరింపులు ఎదురైతే అప్పుడే, అక్కడే బయటపెట్టాలని అన్నారు. చిత్ర రిశ్రమలోకి వచ్చన కొత్తలో నాకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. చిత్రపరిశ్రమలోకి కొత్తగా వచ్చే చాలా మంది ఈ ఇబ్బందులను ఎదుర్కొని ఉంటారు. నాతో అసభ్యంగా ప్రవర్తించిన వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పా.. ఇప్పుడు నేను వారికి కనిపిస్తే చేతులు కట్టుకుంటారు' అంటూ చెప్పుకొచ్చింది.
చాలా ఏళ్లు గడిచిన తర్వాత ఆ సంఘటనలను బయటపెట్టడం అంత తెలివైన పనికాదంటూ ‘మీటూ’ ఉద్యమంపై తన అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం షకీలా బయోపిక్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో షకీలా పాత్రలో బాలీవుడ్ హాట్ బ్యూటీ రిచా చద్దా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్..పై రక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే షకీలా జీవితంలోనే సంతోషాలే కాదు కష్టాలను ఈ సినిమాలో చూపించబోదున్నట్లు దర్శక, నిర్మాతలు అంటున్నారు.
ఒకప్పుడు మళియాళ ఇండస్ట్రీలో షకీలా సినిమాలంటే ఎంత క్రేజ్ ఉండేదో అందరికీ తెలిసిందే..ఆమె సినిమాలు వస్తున్నాయంటే..స్టార్ హీరోలకు సైతం గుండెల్లో గుబులు పుట్టేదని టాక్..అలాంటి షకీలా జీవితంలో ఎన్నో వొడిదుడుకులు నుభవించారు. ప్రస్తుతం ఒకటీ రెండు సినిమాల్లో మాత్రమే ఆమె నటిస్తున్నారు.