ఈ మద్య వస్తున్న సినిమాల్లో లిప్ లాక్, బెడ్ రూమ్, బాత్ రూమ్ హాట్ సీన్లు ఎక్కువ చూపిస్తున్నారు. సెన్సార్ బోర్డు ఎన్ని అభ్యంతారాలు పెడుతున్నా ఇలాంటి సన్నివేశాలు తీస్తూనే ఉన్నారు. అయితే ఒకప్పుడు హాలీవుడ్ కే పరిమితం అయిన ఇలాంటి సన్నివేశాలు ఇప్పుడు భారతీయ చలన చిత్రాల్లో కామన్ అయ్యింది. ఇలాంటి సినిమాలకు యూత్ బాగా కనెక్ట్ కావడంతో దర్శక, నిర్మాతలు ఇలాంటి సీన్లపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 లాంటి సినిమాలు ముద్దు సీన్లకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.
మొదట్లో అభ్యంతరాలు వచ్చినా..ఈ సినిమాలు మాత్రం మంచి సక్సెస్ సాధించాయి. ఇక బాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు కోకొల్లలుగా వస్తున్నాయి. రణవీర్ సింగ్, అలియా భట్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన మూవీ గల్లీబాయ్. జోయా అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రేపు విడుదల కానుంది. ఈ మూవీలో పలు సీన్లు కత్తెరింపుకు గురైనట్లు సమాచారం..అంతే కాదు సినిమాకి U/A సర్టిఫికెట్ అందించారు సెన్సార్ బోర్డ్.
ఈ సినిమాలో ఓ రొమాంటిక్ సన్నివేశంలో రణవీర్, అలియా మధ్య ఉన్న 13 సెకన్ల ముద్దు సన్నివేశం నిడివి తగ్గించమని సీబీఎఫ్సీ సూచన చేయడంతో పాటు క్లోజప్ షాట్‌ని వైడ్ యాంగిల్లో చూపించమని సలహా ఇచ్చిందట. గల్లీ బాయ్ మూవీ ఇటీవల బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించగా ఈ మూవీకి ఇండియన్ క్రిటిక్స్, ఇంటర్నేషనల్ ఫిలిం జర్నలిస్ట్స్ మంచి ప్రశంసలు లభించాయి.
ముంబై లో ఓ మురికి వాడలో ఉండే యువకుడు గొప్ప ర్యాపర్ ఎలా అయ్యాడు..ఆ సమయంలో ఎలాంటి కష్టాలు అనుభవించాడు అన్న నేపథ్యంలో సినిమా కథ ఉండబోతుందట. మేరీ గల్లీ, రూట్స్‌లాంటి హిట్ ర్యాప్ సాంగ్స్ సృష్టికర్త అయిన ఇండియన్ ర్యాపర్ డివైన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది.