ఈ మద్య మెగాబ్రదర్ నాగబాబు తన సొంత యూట్యూబ్ ఛానల్ ఒకటి ఏర్పాటు చేసి పలువురిపై సంచల కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఆ మద్య నందమూరి బాలయ్య ఎవరో తెలియదని చెప్పి సీనియర్ నటుడు బాలయ్య గురించి మాట్లాడారు. ఆ తర్వాత కమెడియన్ బాలకృష్ణ ఫోటో చూపించి ఈయన కామెడీ చాలా బాగా చేస్తారని అన్నారు. దాంతో కొంత కాలం పాటు నందమూరి, మెగా ఫ్యాన్స్ మద్య పెద్ద యుద్దమే జరిగింది. కానీ నాగ బాబు మాత్రం ఏక్కడా తగ్గలేదు.
తాజాగా బాలకృష్ణ ఎవరో తనకు తెలియదన్న మెగాబ్రదర్ నాగబాబుపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ప్రసన్నకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి - బాలకృష్ణ మంచి సన్నిహితులు. ఎప్పుడు ఏదైనా కార్యక్రమాలకు హాజరైతే ఆప్యాయంగా పలుకరించుకుంటారు. అలాంటి వారి మద్య మెగా బ్రదర్ నాగ బాబు చిచ్చు పెట్టే విధంగా చేయడం ఎంత వరకు ఒప్పుకునే విషయం కాదని అన్నారు. నిజానికి నాగబాబుది బాలయ్య స్థాయి కాదన్నారు. బాలయ్య స్థాయితో నాగబాబు సరిపోలరని తేల్చి చెప్పారు.
బాలకృష్ణపై లేనిపోని కామెంట్లు చేస్తున్న నాగబాబు వ్యాఖ్యలను ఆయన విచక్షణకే వదిలేస్తున్నట్టు చెప్పారు. అంతే కాదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సభ్యుడిగా ఉన్న నాగబాబు ఆ హోదాలో ఉండి ప్రముఖ నటులు బాలకృష్ణ తెలియదని కామెంట్ చేయడం హాస్యాస్పదం అన్నారు. నాగబాబు చేస్తున్న వ్యాఖ్యల వల్ల వరుణ్‌తేజ్ సినిమాలపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. నాగబాబు ఒకసారి అద్దం ముందు నిల్చుని తాను చేస్తున్నది కరెక్టో, కాదో తనను తాను ప్రశ్నించుకోవాలని ప్రసన్నకుమార్ సూచించారు