బాహుబలి తరువాత అనుష్క సినిమాలు చాలా వరకు తగ్గించేసింది. గతంలో వరుసగా సినిమాలు చేసిన అనుష్క, ఇప్పుడు చాలా సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటోంది. భాగమతి తరువాత సినిమా చేయలేదు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.
బాహుబలిలో కొద్దిగా లావుగా కనిపించిన ఈ భామ, ఆ సినిమా తరువాత కొద్దిగా వెయిట్ తగ్గి తిరిగి తన పూర్వ స్థితికి వచ్చింది. ప్రస్తుతం సైలెన్స్ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 24 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. ఎక్కువ భాగం అమెరికాలోనే షూట్ ఉంటుంది.
ఎన్నారై బిజినెస్ విమెన్ గా అనుష్క కనిపిస్తుండటం విశేషం. ప్రస్తుతం అనుష్క చేతిలో ఉన్న సినిమా ఇదొక్కటే. ఈ సినిమా తరువాత నెక్స్ట్ చేయబోయే సినిమా ఏంటి అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకూడదని నిర్ణయించుకున్న అనుష్క, దానికి అనుగుణంగానే సినిమాలు ఎంచుకోవడం విశేషం.