మహేష్ ప్రస్తుతం సక్సెస్ జోరులో ఉన్నాడు. భరత్ అనే నేను, మహర్షి రెండు వరస విజయాలు. చాలా కాలం తరువాత ఇలా వరసగా హిట్స్ కొట్టాడు మహేష్. ఈ పరంపరను ఇలాగే కొనసాగించేందుకు మహేష్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. తన నెక్స్ట్ మూవీ అనిల్ రావిపూడితో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కథ, కథనాలు పూర్తయ్యాయి. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చురుగ్గా సాగుతోంది.
మహేష్ విదేశాల నుంచి వచ్చాక... ఈ సినిమాలో జాయిన్ అవుతాడు. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా కథను తెరకెక్కించబోతున్నారు. సినిమా టైటిల్ విషయంలో యూనిట్ కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టింది. మహేష్ మూడు అక్షరాలా పేర్లు కావాలని అంటే యూనిట్ మాత్రం కథకు తగిన టైటిల్ కోసం వెతుకులాట మొదలుపెట్టింది.
మొదట సరిలేరు నీకెవ్వరూ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఆ తరువాత ఇప్పుడు రెడ్డిగారి అబ్బాయి అనే టైటిల్ ప్రచారంలో ఉంది. టైటిల్ లో వెయిట్ ఉండటంతో పాటు పాజిటివ్ వైబ్ కూడా ఉండటంతో ఈ టైటిల్ కు నిర్మాత దిల్ రాజు ఫిక్స్ అయ్యి రిజిస్టర్ కూడా చేయించారని ప్రచారం. పక్కా రాయలసీమ బ్యాక్ డ్రాప్ స్టోరీ అని, ఫ్యాక్షన్ తో పాటు పక్కా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందట. రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకు స్వర మాంత్రికుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.