జూలై రెండవ వారంలో వరల్డ్ కప్ క్రికెట్ మ్యానియాను కూడ లెక్క చేయకుండా ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ మూవీ విడుదల కాబోతోంది. అయితే ఇప్పటివరకు తన తమ్ముడు సినిమా గురించి ఒక్కమాట మాట్లాడలేదు అని విమర్శలు ఎదుర్కుంటున్న విజయ్ దేవరకొండ వ్యూహాత్మకంగా సుకుమార్ ను తన తమ్ముడు ‘దొరసాని’ కోసం ఇప్పుడు రంగంలోకి దింపడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.
తెలుస్తున్న సమాచారం మేరకు జూలై 1న ‘దొరసాని’ మూవీ ట్రైలర్ సుకుమార్ చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ ను బాగా చేసి మీడియాలో హాట్ న్యూస్ గా మార్చడానికి ఈమూవీ నిర్మాతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే సుకుమార్ ‘దొరసాని’ ట్రైలర్ లాంచ్ కు అంగీకరించడం వెనుక విజయ్ దేవరకొండ రాయబారాలు ఫలించాయి అన్నవార్తలు వస్తున్నాయి. ‘రంగస్థలం’ తరువాత మహేష్ తో తీవ్ర అవమానాన్ని పొందిన సుకుమార్ విజయ్ దేవరకొండను దృష్టిలో పెట్టుకుని ఒక పవర్ ఫుల్ స్టోరీ ఇప్పటికే తయారుచేసాడు అన్న వార్తలు వస్తున్నాయి.
ఈకథ విజయ్ కు బాగా నచ్చడంతో ఈమూవీని వచ్చే ఏడాది చేస్తానని సుకుమార్ కు మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే వచ్చే ఏడాది సుకుమార్ బన్నీల కాంబినేషన్ లో ఒక మూవీకి రంగం సిద్దం అయినప్పటికీ బన్నీ పై సుకుమార్ కు నమ్మకంలేక ఇలా విజయ్ దేవరకొండను లైన్ లో పెడుతున్నాడా అన్న సందేహాలు కూడ వ్యక్తం అవుతున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి