బోయపాటితో సినిమా అంటే భారీతనం ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉంటుంది. దీనికోసం భారీగా ఖర్చు చేస్తుంటారు. బోయపాటి కెరీర్ స్టార్టింగ్లో ది బెస్ట్ సినిమాలు తీశాడు. కానీ, గత కొంతకాలంగా ఈ దర్శకుడు వరసగా ప్లాప్ లు ఇస్తూ హీరోలను ఇబ్బందుల్లో పడేస్తున్నాడు.
వినయ విధేయ రామ ప్లాప్ తరువాత, బోయపాటి బాలకృష్ణతో సినిమా చేయాలని అనుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు కూడా ముగిశాయి. త్వరలోనే స్టార్ట్ అవుతుందని ఫిబ్రవరిలోనే అనుకున్నారు. కానీ, ఇప్పటి వరకు సినిమా గురించిన ఎలాంటి సమాచారం లేదు.
సినిమా వాయిదా పడినట్టు తెలుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. బడ్జెట్ ఎక్కువగా ఉండటం వలన పక్కన పెట్టారని వినికిడి. ఇదిలా ఉంటె, బోయపాటితో సినిమా చేయడానికి అల్లు అరవింద్ సిద్ధం అయ్యాడు. సైరైనోడు వంటి మాస్ హిట్ ఇచ్చిన బోయపాటితో మరో సినిమా చేయాలని నిర్మాతకు ఉంటుంది. అల్లు అరవింద్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేశాడు.
నిర్మాత ఎస్ అన్నాడు కాబట్టి దర్శకుడికి భయం ఏముంటుంది. ఇప్పుడు కావాల్సిందల్లా హీరో. అల్లు అరవింద్ కాబట్టి మెగాహీరోలతోనే సినిమా చేస్తారు. అల్లు అర్జున్ మొదటి ఛాయస్ ఉంటుంది. ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. మెగాస్టార్ కూడా మూడు సినిమాలు చేయాల్సి ఉంది. మిగతా మెగాహీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్ లు బోయపాటితో సినిమా అంటే ఆలోచనలో పడిపోయారు. మెగా హీరోలు కాకుండా అల్లు అరవింద్ బయట హీరోలతో సినిమాలు చేస్తారా.. చేస్తే ఎవరితో చేస్తారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.