2010లో వచ్చిన 'తీన్ పట్టి' సినిమా ద్వారా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శ్రద్ధ కపూర్. తండ్రి శక్తి కపూర్ నటవారసత్వంతో సినిమా రంగ ప్రవేశం చేసిన శ్రద్ధకు, హీరోయిన్ గా నటించిన మూడవ చిత్రం ఆషికి 2 విపరీతమైన పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో ఆదిత్య రాయ్ కపూర్ తో కలిసి ఆమె పోషించిన ఆరోహి పాత్రను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరని చెప్పాలి. ఇక అక్కడినుండి ఆమెకు వరుసగా అవకాశాలు క్యూకట్టాయి. అయితే వచ్చిన అవకాశాలను ఎప్పటికపుడు అందిపుచ్చుకుని మంచి సక్సెస్ లు అందుకుంటూ,
ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా ఎదిగారు శ్రద్ధ. ప్రస్తుతం తెలుగు అగ్రనటుల్లో ఒకరైన ప్రభాస్ తో కలిసి సాహో సినిమాలో నటిస్తున్న శ్రద్ధ, ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి తొలిసారి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో శ్రద్ధ మాట్లాడుతూ, తనకు బాలీవుడ్ లోనే కాక కోలీవుడ్ మరియు టాలీవుడ్ హీరోల్లో కొందరంటే ఎంతో అభిమానమని, ప్రస్తుతం సాహో సినిమాలో ప్రభాస్ తో కలిసి నటిస్తున్న అనుభవం ఎప్పటికీ మరిచిపోలేనిదని ఆమె చెప్పుకొచ్చారు. ఆపై ఆమె మాట్లాడుతూ, ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన హీరోల్లోటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎంతో అభిమానమని,
ఒకవేళ భవిష్యత్తులో అయన ప్రక్కన హీరోయిన్ గా నటించే ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోనని ఆమె అన్నారు. అంతేకాక మహేష్ కు ఇక్కడ అనేకమంది అభిమానులున్నారని ఆమె చెప్పుకొచ్చింది. వాస్తవానికి శ్రద్ధ సహా ఇప్పటికే పలువురు టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్లు, తమకు మహేష్ బాబు అంటే ఎంతో ఇష్టమని, ఆయన ప్రక్కన హీరోయిన్ గా ఒక్క ఛాన్స్ వస్తే చాలని చెప్పిన ఘటనలు చాలానే వున్నాయి. మరి శ్రద్ధ ఆశపడుతున్నట్లు తన అభిమాన నటుడు మహేష్ తో కలిసి నటించే అవకాశం ఎప్పుడు వస్తుందో చూడాలి మరి.....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి