నిన్న హైదరాబాద్ ఫిలింనగర్ లోకళాతపస్వి విశ్వనాధ్ ని ఆయన ఇంటిలో ముఖ్యమంత్రి కేసీఆర్ కలుసుకున్న న్యూస్ అత్యంత సంచలనంగా మారింది. ఇది కేవలం ఒక మర్యాద పూర్వకమైన క్యాజువల్ మీటింగ్ మాత్రమే అని క్లారిటీ వచ్చినా కొన్ని మీడియా వర్గాలలో విశ్వనాథ్ కు ఆరోగ్యం బాగాలేదు అంటూ వార్తలు వచ్చాయి.
దీనితో విశ్వనాధ్ సన్నిహితులు అంతా కళాతపస్వి ఆరోగ్యం గురించి ఆయనకు ఫోన్ చేసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అనుకోని సంఘటనకు షాక్ అయిన విశ్వనాధ్ తన ఆరోగ్యం బాగా లేదు అంటూ కొన్ని మీడియా వర్గాలు చేసిన ప్రచారానికి షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
దీనితో విశ్వనాథ్ సన్నిహితులు కొందరు విశ్వనాథ ఆరోగ్యం బాగుంది అంటూ క్లారిటీ ఇవ్వడమే కాకుండా అటువంటి వార్తలను ప్రచారంలోకి తీసుకు రావద్దని కోరినట్లు తెలుస్తోంది. అయితే నిన్న ఎటువంటి సందర్భం లేకుండా కెసిఆర్ విశ్వనాథ్ ని కలవడం వెనుక ఎదో ఒక ఆంతర్యం ఉండి ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ ప్రభుత్వం తరఫున విశ్వనాథ్ కు ఏమైనా సత్కారం చేయబోతున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
అయితే ప్రస్తుతం 89 సంవత్సరాల వయస్సులో ఉన్న విశ్వనాథ్ నుండి ఎదో ఒకటి కళలకు సంబంధించిన విషయమై ఆయన సలహాలు తీసుకోవడానికి కెసిఆర్ విశ్వనాథ్ ను కలిసి ఉంటారు అన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు 54 సినిమాలు తీసిన విశ్వనాథ్ 2010లో తాను తీసిన ‘శుభప్రదం’ ఫ్లాప్ అయిన తర్వాత సినిమాల దర్శకత్వానికి దూరంగా ఉంటున్నారు. అయితే అప్పుడప్పుడు సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం తన శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్న విశ్వనాథ్ ను కె సి ఆర్ కలవడం వెనుక ఎదో ఒక ఆంతర్యం ఉండి ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది..