-
Amitabh Bachchan
-
Audience
-
Chiranjeevi
-
Cinema
-
Darsakudu
-
Director
-
festival
-
Heroine
-
India
-
JagapathiBabu
-
jagapati babu
-
Joseph Vijay
-
Konidela Production
-
Music
-
Narasimha
-
nayantara
-
News
-
R Rathnavelu
-
ram pothineni
-
Ratnavelu
-
ravi anchor
-
Reddy
-
Saira Narasimhareddy
-
Tollywood
-
uyyalawada narasimha reddy
-
vijay
-
you tube
-
Youtube
మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమా సైరా నరసింహ రెడ్డి సినిమా ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తొలితరం స్వాతంత్రోద్యమ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను ఆధారం చేసుకుని తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రేక్షకులు మరియు మెగా ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ సంపాదించడం జరిగింది.
భారీ స్థాయి సాంకేతిక విలువలతో మరియు బడ్జెట్ తో పాన్ ఇండియా ఫీల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార మెగాస్టార్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, రవి కిషన్, జగపతి బాబు వంటి దిగ్గజ నటులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్, తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం అమిత్ త్రివేది అందిస్తుండగా, కెమెరా మాన్ గా రత్నవేలు పని చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ తో కలిసి ఆయన కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150కి పనిచేసిన రత్నవేలు,
సైరా సినిమాలో ఫోటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలవనుందని ఇటీవల మాట్లాడుతూ చెప్పారు. ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని మరొక మూడు రోజుల్లో, అనగా 15వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఇక మరోవైపు ఈ సినిమా ప్రి రిలీజ్ వేడుక కోసం కర్నూలును వేదికగా నిర్ణయించినట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే వీటిపై సైరా టీమ్ నుండి అధికారిక ప్రకటన వెలువడవలసి ఉంది. మరి దీన్నిబట్టి చూస్తుంటే రాబోయే మరికొద్దిరోజుల్లోనే మెగాస్టార్ ఫ్యాన్స్ కు పెద్ద పండుగ రాబోతున్నట్లు తెలుస్తోంది.....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి