వైయస్సార్ పార్టీ మహిళా నేత మరియు నగిరి ఎమ్మెల్యే అయిన మాజీ సినీ నటి రోజా వారి పార్టీకే ఫైర్ బ్రాండ్ అని చెప్పవచ్చు. పార్టీలో ఆమె కనబరిచే దూకుడు మరియు ప్రత్యర్థి పార్టీలను ఆమె విమర్శించే తీరు చూసి ఖచ్చితంగా ఆమెకు జగన్ ఏదో ఒక మినిస్ట్రీ కట్టబెడతారు అని అంతా అనుకున్నారు. కానీ రోజాకు మాత్రం అలాంటిది ఏమీ దక్కకపోగా చివరికి అసెంబ్లీ స్పీకర్ గా అయినా నియమిస్తారు అనుకుంటున్న నేపథ్యంలో అక్కడ కూడా ఆమెకు బదులుగా తమ్మినేనికి ఆ పదవి ఇచ్చారు. అయితే రోజా శ్రమ మాత్రం ఊరికే పోలేదు. ఆమె సేవలను గుర్తించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమెను ఏపీఐఐసీ చైర్మన్ గా నియమించింది.

ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా రోజా చాలా భారీ మొత్తాన్ని పొందనుంది. రోజా కి ప్రతీ నెల దాదాపుగా 3.8 లక్షల రూపాయలు జీతం రూపంలో ముట్టనున్నాయి. వీటిలో రెండు లక్షల రూపాయలు ఆమె జీతం కాగా మిగిలిన మొత్తం ఆమె ఖర్చులకి కేటాయించారు. రవాణా ఖర్చులకు 60000, ఇంటి రెంటు కు 50 వేలు మరియు మొబైల్ బిల్లుకు రెండు వేల రూపాయలు కేటాయించారు. ఇక ఇవి కాకుండా రోజా కి తోడుగా ఉండే సిబ్బందికి 70 వేల రూపాయలు అందనున్నాయి.

ఇంత భారీ మొత్తంలో ఆమెకు ప్రతీ నెలా ప్రభుత్వం నుంచి నగదు ముట్టింది. ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా రోజా జీతం నెలకు 1.25 లక్షలు. అంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం 2016 లో శాసన సభ సభ్యుల జీతాలను 95 వేల రూపాయలు నుంచి 1.25 లక్షలకు పెంచింది. ఇప్పుడు దాదాపుగా రోజాకు చేతికి ఐదు లక్షల రూపాయలు ప్రతినెల రానున్నాయి. రోజా మంచి ఛాన్స్ కొట్టేసింది కదూ..!


మరింత సమాచారం తెలుసుకోండి: