బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 మరో వారం రోజులలో గ్రాండ్ ఫినాలే. తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 చాలా రసవత్తరంగా సాగుతోంది. గొడవలతో.. తిట్లతో.. కష్టమైన టాస్కులతో షో ముందుకు సాగుతుంది. గతంలో వచ్చిన
బిగ్ బాస్ సీజన్ 1, సీజన్ 2 షోల కంటే టాప్ రేటింగ్‌తో ముందుకు వెళ్తుంది. అయితే ఈ సీజన్ 3 కు ఫుల్ కాంట్రవర్సియల్ షోఅని అంటే తప్పు లేదు.
అయితే ఈరోజు వీకెండ్
ఎపిసోడ్ కావడంతో ఉన్న ఆరు మందిలో ఒకరు ఎలిమినట్ కావాలి. అయితే ఈ వీక్ మొదలు నుంచి
బిగ్ బాస్ లో ప్రేమానురాగాలు పెంచుకున్న
శివ జ్యోతి అక్క ఎలిమినేట్ అవుతుందా ? లేక
అలీ రెజా ఎలిమినేట్ అవుతాడా అనేది అందరికి డౌట్ గానే ఉండేది .
అయితే నిన్నటి నుండి
అలీ రెజా ఔట్ అని సోషల్ మీడియాలో రచ్చ చేశారు. అయితే అందరూ రచ్చ చేసినట్టు
అలీ రెజా ఎలిమినట్ అవ్వలేదు. ఎవరు ఊహించని విధంగా
శివ జ్యోతినే ఎలిమినేట్ అయ్యింది. దీంతో
శివ జ్యోతినే ఎలిమినట్ అయినవెంటనే ఎప్పుడులనే ఏడుపు మొదలెట్టేసింది.
ఇంకా జర్నీ వీడియో చూసే సమయంలో అయితే వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఏది ఏమైనా ఎప్పుడో ఎలిమినట్ కావాల్సిన
శివ జ్యోతి నామినేషన్స్ లోకి రాకుండా చాలావారాలు తప్పించుకుంది. ఒక్క
శివ జ్యోతినే కాదు. వితిక కూడా నామినేషన్స్ లోకి రాకుండా తప్పించుకుంది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా
శివ జ్యోతి అక్క అందరి కంటే నేనే గ్రేట్ నేనే గ్రేట్ అని చెప్పుకుంటూనే ఎలిమినేట్ అయిపోయింది.