రవిబాబు ఇటీవల తీస్తోన్న నాసిరకం సినిమాలతో ప్రేక్షకులకు చుక్కలు కనపడుతున్నాయి. ఒకప్పుడు డిఫరెంట్ కాన్సెఫ్ట్లతో సినిమాలు తీసే రవిబాబు వరుసగా పసలేని చెత్త కథనలు ఎంచుకుని... చాలా చెత్త స్క్రీన్ ప్లేతో మరో రాంగోపాల్ వర్మను గుర్తు చేస్తున్నాడ్రా బాబూ అన్నట్టుగా సినిమాలు చేస్తున్నాడు. ఎందుకంటే రవిబాబు గత సినిమాలను చూస్తే పైన చెప్పుకున్న సందేహాలు రాకమానవు.
ఇక తాజా
సినిమా ఆవిరి టీజర్లు, ట్రైలర్ల విషయంలో రవిబాబు ఆశలే రేకెత్తించాడు. ఇక ఈ
సినిమా తొలి షో చూసిన వారు అయితే మధ్యలోనే బుర్ర పట్టుకుని థియటర్ల నుంచి బయటకు పరుగులు పెడుతోన్న పరిస్థితి. అసలు ఈ
సినిమా కథ చాలా నాసిరకంగా ఉందనుకుంటే... స్క్రీన్ ప్లే ఓ సగటు సినీ అభిమానికి ఇచ్చినా ఇంకా బాగా రాసేవాడని అందరూ అభిప్రాయపడుతున్నారు.
ఇక రవిబాబు డైరెక్షన్ ఏ మాత్రం ఆడియెన్స్‌ను సీట్లలో కూర్చోపెట్టలేకపోయింది. అందుకే వారంతా ఫస్ట్ షో ఫస్ట్ హాఫ్ మధ్యలోనే కనీసం ఇంటర్వెల్ వరకు కూడా వెయిట్ చేయకుండా బయటకు వెళ్లిపోయిన పరిస్థితి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే అంశం ఒక్కటి కూడా సినిమాలో లేదనుకుంటే... చివరకు భయపెట్టలేకపోయిన హార్రర్ ఎలిమెంట్స్.... పరమ బోరింగ్ సీన్లతో రవిబాబు విసుగెత్తించేశాడు.
అసలే తలనొప్పిరా బాబు అనుకుంటే దీనికి తోడు
సినిమా బాగా స్లోగా సాగుతూ బోర్ గా కొడుతొంది. పైగా సినిమాలో చాలా భాగం ఇంట్రస్ట్ కలిగించలేని రొటీన్ హారర్ తంతుగా ఉంది. అసలు సినిమాలో ఇప్పుడు ఏమవుతుందో అనే ఒక పెయిన్ ఫుల్ కంటెంట్ అండ్ టెన్షన్ ను ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా దానిని వాడకుండా అసలు డైరెక్షన్ తెలియని వ్యక్తిలా
సినిమా తీశాడు. ఇకనైనా రవిబాబు మారితే అతడికి సరికొత్త ఇమేజ్ ఉంటుంది... లేనిపక్షంలో రవిబాబు మరో వర్మను తలపించడం ఖాయం.