విలక్షణ నటుడు, విశ్వనటుడు కమల్ హాసన్ అనేక ప్రయోగాత్మక సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన చిన్న తనం నుంచి కూడా సినిమాలు చేస్తూ మెప్పిస్తూ వస్తున్నాడు.  చేసే ప్రతి సినిమా కూడా ఒక అద్భుతం అని చెప్పాలి.  ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్లో నటించి మెప్పించాడు.  ప్రయోగాత్మకంగా ఉండే సినిమాలు చేయడంలో తనకు తానే సాటి అనిపించుకున్న కమల్ ..  సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో చాలా సినిమాలు చేశారు.  
ప్రతి సినిమా హిట్ అయ్యింది.  ఇందులో భాగంగానే కమల్ హాసన్ పుష్పక విమానం సినిమా చేశారు.  మాటలు ఉండవు.  ఓన్లీ యాక్షన్ మాత్రమే.  నిజంగా సినిమా కడుపుబ్బా నవ్విస్తుంది.  ఈ సినిమా తరువాత అమావాస్య చంద్రుడు చేశారు.  కమల్ లోని రెండోకోణం.. నటనకు పరాకాష్ట ఆ సినిమా.  ఈ సినిమా తరువాత అపూర్వ సహోదరులు చేశారు.  అది భారీ హిట్.  ఈ సినిమాలో కమల్ హాసన్ ను పొట్టిగా చూపించి విధానం నిజంగా వండర్.  
ఆ తరువాత  సైన్స్ ఫిక్షన్ సినిమా ఆదిత్య 369 చేయాలనీ అనుకున్నారు. దానికోసమే కథను సిద్ధం చేసుకున్నారు కూడా. అయితే, అప్పటికే కమల్ హాసన్ చాలా బిజీగా ఉన్నాడు.  రెండు సినిమాలు చేస్తున్నాడు.  ఆదిత్య 369 లో కృష్ణదేవారాయలుగా బాలకృష్ణను, కృష్ణకుమార్ గా కమల్ హాసన్ ను పెట్టి మల్టీస్టారర్ గా చేయాలని అనుకుంటే.. ఆ ప్రయోగం ఫెయిల్ అయ్యింది.  కమల్ హాసన్ బిజీగా ఉండటంతో.. బాలయ్యతోనే సినిమా చేయాల్సి వచ్చింది.  
బాలకృష్ణతోనే సినిమా పూర్తి చేశారు.  సినిమా బంపర్ హిట్ అయ్యింది.  మాములు హిట్ కాదు.  అప్పట్లో ఈ సినిమా ఓ సంచలనం.  తెలుగులో సైన్స్ ఫిక్షన్ సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి.  వచ్చినా ఈ సినిమా అంతగా ద్రుష్టి పెట్టలేదు.  ఈ సినిమా మరోకోణంలో ఉండటం కలిసి వచ్చింది.  కృష్ణదేవారాయలుగా, కృష్ణ కుమార్ గా కమల్ నటన అమోఘం.  ఇక రాయలుగా బాలయ్య నటనకు అద్భుతంగా ఉంటుంది.  సాంగ్స్ నుంచి ప్రతి ఒక్కటి సినిమాకు ప్లస్ అయ్యింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: