మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ మొదలైనప్పటి నుంచే జబర్దస్త్ జడ్జ్ గా  కొనసాగిన నాగబాబు జబర్దస్త్ కి సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయి జబర్దస్త్ షో కి ఫెమస్ అవడంలో భాగమైపోయారు . అయితే ఎప్పుడూ బయట సీరియస్ గా కనిపించే నాగబాబు జబర్దస్త్ లో నవ్వుల పువ్వులు పూయించడంతో తెలుగు ప్రేక్షకులందరూ జబర్దస్త్ షో కి ఎక్కువగా ఆకర్షితులయ్యారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ జడ్జ్ గా తప్పుకోగా  బాబుతో పాటు చమ్మక్ చంద్ర... కిరాక్ ఆర్పి టీములు జీ తెలుగు లో ప్రసారమయ్యే ఓ షోలో  ప్రత్యక్షమై కామెడీని పండించారు. మళ్లీ ఏమైందో తెలియదు కానీ జబర్దస్త్ లోకి వచ్చి కామెడీ పంచుతున్నారు. 

 


మొదటి నుండి జబర్దస్త్ నుంచి తనతో పాటు వస్తారు అనుకున్న సుడిగాలి సుదీర్ హైపర్ ఆదిలు  మాత్రం జబర్దస్త్ లోనే కొనసాగారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ నుంచి తప్పుకోవడంతో మెగా బ్రదర్ నాగబాబు పై కమెడియన్స్ పంచ్ లు  వేయడం మొదలు పెట్టేశారు. ఒకప్పుడు జడ్జీగా ఉన్న నాగబాబు ను ప్రసన్నం చేసేందుకు తెగ పొగిడిన ఆ కమెడియన్స్... ప్రస్తుతం నాగబాబు పై సెటైర్లు వేస్తున్నారు. అయితే జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన తర్వాత నాగబాబు యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజా ఎపిసోడ్లో  కమీడియన్స్ నాగబాబుపై అదిరిపోయే పంచులు వేశారు. 

 


 తన స్కిట్ లో భాగంగా కంటెస్టెంట్ లతో డైలాగ్ లు చెప్పించి  మరి సెటైర్లు వేయించాడు హైపర్ ఆది. అరే మనం ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలిరా అంటే వెంటనే హైపర్ ఆది ఏడేల్లుగా  కలిసి ఉన్న వాళ్ళే విడిపోతున్నారు... బొక్క మూడేళ్ల  మన రిలేషన్ ఎంత అంటూ అదిరిపోయే పంచ్ విసిరాడు . ఇక అటు చలాకి చంటి కూడా తన స్టైల్ లో నాగబాబుపై  సెటైర్ వేశాడు. జబర్దస్త్ రాజ్యంలో వేరే రాజు ఉండాలి కదా అంటూ ఓ కంటెస్టెంట్ అడిగితే... ఆయనకు ఇక్కడ భోజన వసతులు బాగోలేక వేరే రాజ్యానికి వెళ్ళిపోయారు... వెళ్తూ వెళ్తూ మాకు ఈ రాజ్యాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు అంటూ నాగబాబు పై సెటైర్ వేసాడు చలాకి చంటి. అయితే కమెడియన్స్ ఇలా పంచులు వేస్తుంటే అట రోజా కూడా బాగానే నవ్వుకుంది. అయితే నాగబాబు వెళ్లిపోయిన అప్పటికి కూడా జబర్దస్త్ రేటింగ్ ఎక్కడ తగ్గకపోవడంతో అటు  మల్లెమాల యాజమాన్యం కూడా హ్యాపీగానే ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: