ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని వివాదం రగులుతూనే ఉంది. రాజధాని మార్పు అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ విమర్శలు చేస్తూనే ఉంది . అయితే తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో  రాజధాని అంశం గురించి అధిక వైసిపి పార్టీని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్యేలు. ఏపీ రాజధాని అమరావతి విషయంపై జగన్మోహన్రెడ్డి సర్కార్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది టీడీపీ . రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక రాజధాని మార్పు విషయంపై అటు  ప్రజల్లోనూ ఇటు పార్టీల్లోనూ అయోమయం నెలకొంది అని రాజధాని విషయంలో స్పష్టత ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రసాద్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు 

 


 రాజధాని కేవలం పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదని రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది కల గౌరవం రాజధాని అని ఆయన అన్నారు.అయితే టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానమిచ్చారు. త్వరలోనే రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల ప్లాట్ లను  అభివృద్ధి చేస్తామంటూ ఆయన తెలిపారు. అమరావతిని అభివృద్ధి చేసే యోచనలో తమ ప్రభుత్వం ఉన్నట్లు ఆయన తెలిపారు. గతంలో తాను రాజధాని మార్పు చేస్తానని చెప్పలేదని తన వ్యాఖ్యలను టీడీపీ వక్రీకరించిందని అసెంబ్లీ వేదికగా చెప్పుకొచ్చారు. 

 


 టిడిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర రాజధాని అమరావతి లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని తాను అన్నానని...  రాజధాని మార్పు చేపడతామని అనలేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. భారత్ పొలిటికల్ మ్యాప్ లో రాజధాని అమరావతిని గుర్తుంచుకోవడానికి కేవలం గత టీడీపీ ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. రాజధాని అమరావతిని మరింత అభివృద్ధి చేసేందుకు జగన్ ప్రభుత్వం నిర్ణయించిందని త్వరలో రాజధాని  రైతులకు ప్లాట్ల అభివృద్ధి కూడా జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని మార్పు జరుగుతోందని అయోమయం లో ఉన్న ఆంధ్ర ప్రజలకు క్లారిటీ వచ్చినట్లయింది. అంతేకాకుండా అమరావతి రైతులకు కూడా జగన్ సర్కార్ ఓ  శుభవార్త చెప్పినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: