అప్పుడెప్పుడో ఎనిమిదేళ్ల క్రితం ‘విజయదశమి’కి ‘బాణం’లా వచ్చిన అమ్మాయి మళ్లీ కంటికి కనిపించలేదు. ఎక్కడపోయిందీ, ఏమీ చేసింది ఎవరికీ తెలియదు. మళ్లీ ఇన్నాళ్లకు నేనున్నాను ఇదే నా‘రూలర్​’అంటూ  తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వచ్చింది అందాల భామ వేదిక. ఆమె బాలకృష్ణ సరసాన నటించిన రూలర్ సినిమా విడుదల సందర్భంగా ఎనిమిదేళ్ల ముచ్ఛట్లను ఏకరువు పెట్టింది. 


తెలుగులో విజయదశమి, బాణం లాంటి చిత్రాల్లో నటించిన తర్వాత  తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో బిజీగా ఉండటం వల్ల తెలుగులో సినిమా చేయలేకపోయాను. నేను తమిళంలో నటించిన కాంచన–3 తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. అందువల్లే నాకు మళ్లీ తెలుగులో అవకాశం లభించింది. రూలర్ లో నాది పూర్తి మాస్ క్యారెక్టర్. గ్లామరస్, ట్రెడిషనల్, పెర్ఫార్మెన్స్ అనే మూడు షేడ్స్ నా పాత్రలో కనిపిస్తాయి. సప్తగిరితో కలసి కామెడీ సీన్స్‌లో నటించాను. పెర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న సీరియస్ సీన్స్ కూడా ఉన్నాయి. డామినేటెడ్‌గా కనిపిస్తాను. పర్సనల్ లైఫ్‌లో కూడా నేను కొంత డామినేటెడ్ అనే చెప్పాలి.  


బాలకృష్ణ గారితో నటించడం సంతోషం. ప్రతి సినిమానీ తొలిచిత్రంలా భావిస్తారాయన. టైమ్‌కి రావడం దగ్గర్నుంచి  డెడికేషన్, తోటి నటీనటుల విషయంలో తీసుకునే కేర్ లాంటివి చూశాక సూపర్ స్టార్ లాంటి మాటలు ఆయన విషయంలో చాలా చిన్నవనిపిస్తోంది. ఆయన చాలా నేర్చుకున్నాను. ఆయనో నాకు రెండు పాటలున్నాయి. ఆయన స్టైలిష్ స్టెప్స్ చాలా ఎంజాయ్ చేశాను.

 

ఏడాది తీయాల్సిన సినిమాను కేవలం మూడున్నర నెలల్లో క్వాలిటీకి కాంప్రమైజ్ అవకుండా తీశారు డైరెక్టర్. నటీనటుల నుండి నటన ఎలా రాబట్టాలో ఆయనకి బాగా తెలుసు. అలాంటి దర్శకుడు లభించడం నటీనటులకి బోనస్. తమిళ, మలయాళ భాషల సినిమాలు కొంత నేచురర్‌‌గా ఉంటాయి. ఇక్కడ కమర్షియల్ మూవీస్ ఎక్కువ. ఆ వేరియేషన్స్ నాకు ఇష్టం. ఒకే తరహా పాత్రలు చేసినా బోర్ కొడుతుంది. ఇటీవల నేను నటించిన బాలీవుడ్ సినిమా ‘ద బాడీ’ రిలీజ్ అయింది. ఓ స్పానిష్ థ్రిల్లర్ కి రీమేక్ అది. ఇమ్రాన్ హష్మి, రిషి కపూర్ లాంటి ప్రముఖులతో కలసి నటించడం హ్యాపీ. రూలర్ తర్వాత తెలుగులో కూడా కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. ఇకపై  వరుస తెలుగు చిత్రాలు చేయాలి అనుకుంటున్నాను.

మరింత సమాచారం తెలుసుకోండి: